గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి రెడ్డి (Gali Kireeti Reddy) తన తొలి చిత్రం ‘జూనియర్’ (Junior) తో చిత్రసీమలోకి అడుగుపెట్టి ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కిరీటి తనలో ఉన్న నటన, డెడికేషన్‌ని నిరూపించుకున్నాడు. డాన్సులు, యాక్షన్ సీన్‌లు అన్ని విభాగాల్లో మంచి మార్కులు సంపాదించాడు. మేకింగ్ వీడియోల ద్వారా అతడి కష్టపడే తత్వం స్పష్టంగా కనిపించింది. తొలి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆయన భవిష్యత్తుకు బలమైన బేస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
కిరీటి ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి వచ్చినప్పటికీ, అతడిలో ఉన్న ఫ్యాషన్, కఠిన శ్రమ, సినిమాపై ఆసక్తి అన్నీ పరిశ్రమలో నిలదొక్కుకునే లక్షణాలు. ‘జూనియర్’లో డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలను తానే చేసి, తాను రిస్క్ తీసుకునే నటుడినని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అందరిలోనూ “కిరీటి నెక్స్ట్ సినిమా ఏది?” అన్న ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. మంచి కథను ఎంచుకుంటే, టాలెంట్ ఉన్న కిరీటికి స్టార్‌గా ఎదగడం పెద్ద కష్టం కాదని విశ్లేషకులు అంటున్నారు.
Kadapa : జగన్ అడ్డాలో కమలం కసరత్తులు
ఆర్థికంగా గాలి కుటుంబం స్ట్రాంగ్. వారాహి బ్యానర్, రాజమౌళి వంటి పెద్ద దర్శకుల మద్దతు, అలాగే తెలుగు – కన్నడ భాషల పట్ల పరిజ్ఞానం కిరీటికి అదనపు బలంగా నిలుస్తాయి. అవసరమైతే తానే నిర్మాతగా మారి మంచి చిత్రాలు తీయగలగడం కూడా అతడి ప్రత్యేకత. ప్రస్తుతం కన్నడ పరిశ్రమ పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది, కాబట్టి కిరీటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, రెండు ఇండస్ట్రీలలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కష్టపడే తత్వం ఉండటంతో, కిరీటి రాబోయే రోజుల్లో ఒక పెద్ద యాక్టర్‌గా ఎదగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.