రేపు సాయంత్రం (June 14) హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం (Gaddar Awards ) జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుండగా, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు అవుతున్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినీ అవార్డులను అందజేస్తుండటంతో సినిమా రంగంలో ఆసక్తి నెలకొంది. గతంలో నంది అవార్డులుగా ఇవ్వబడిన అవార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరిట మళ్లీ ప్రారంభించింది. 2014 నుండి 2024 వరకు ఉత్తమ చిత్రాలను ఇప్పటికే ఎంపిక చేశారు.
DGCA Orders: విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం, ఇకపై ఈ రూల్స్ పాటించాల్సిందే!
అయితే ఈ అవార్డుల ఆహ్వాన పత్రికపై గద్దర్ ఫోటో లేకపోవడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈ విషయంపై తీవ్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. “ప్రతి సందర్భంలో గద్దర్ పేరు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన పేరిట ఇచ్చే అవార్డుల ఆహ్వాన పత్రికలో మాత్రం ఆయన ఫొటోను పెట్టకపోవడం బాధాకరం” అన్నారు. తన ట్విట్టర్‌లో ఆహ్వాన పత్రిక చిత్రాలను షేర్ చేస్తూ గద్దర్‌కు యథావిధిగా గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
CM Chandrababu : సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం.. పలు అభివృద్ధి పనులకు ఆమోదం
ప్రజా గాయకుడిగా, విప్లవ నాటక కారుడిగా, సామాజిక సమస్యలపై పోరాడిన వ్యక్తిగా గద్దర్‌కు ప్రజల్లో విస్తృత స్థాయిలో గౌరవం ఉంది. ఆయన పేరిట అవార్డులు ఇవ్వడమొక మంచి నిర్ణయమే అయినా, ఆయన ఫొటో లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని ప్రదర్శించి ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించేలా చర్చ మొదలైందని చెప్పాలి.
ప్రజా గాయకుడు గద్దర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రతి సందర్భంలో గద్దర్ గారి పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్ వారి పేరు మీద ఇస్తున్నటువంటి సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ గారి ఫోటో లేకపోవడం బాధాకరం
కనీసం అవార్డుల పంపిణీ… pic.twitter.com/iZwokSb82u
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 13, 2025