Site icon HashtagU Telugu

Gaddar Awards : గద్దర్ అవార్డు వారికే అంకితం – అల్లు అర్జున్ ట్వీట్

Gaddar Awards

Gaddar Awards

ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌(Gaddar Awards)లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ గౌరవం తనకు ఎంతో స్పూర్తిదాయకంగా, గర్వంగా ఉందని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ అవార్డుకు కారణమైన వ్యక్తులుగా దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మరియు పుష్ప సినిమా బృందాన్ని అల్లు అర్జున్ కొనియాడారు. పుష్ప సినిమాలోని పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైనదని, తాను అందులో కనిపించిన ప్రతిభకు ఈ అవార్డు ఒక గుర్తింపు అని అభిప్రాయపడ్డారు. ఇది వ్యక్తిగత విజయం కాకుండా, పుష్ప టీమ్ మొత్తం కృషికి ఫలితమని పేర్కొన్నారు.

ఈ అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. తన కెరీర్‌లో ఎప్పుడూ ప్రేమ, మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాగే ఆదరించమని, మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఇది ఒక ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.

అవార్డ్స్ ఫుల్ లిస్ట్ చూస్తే..

ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి : నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
బెస్ట్ సపోర్టింగ్ నటుడు : ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
బెస్ట్ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
బెస్ట్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
బెస్ట్ కమెడియన్స్ : వెన్నెల కిషోర్, సత్య
ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ : నల్ల శీను(రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరీ అవార్డు(హీరో) : దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ అవార్డు (హీరోయిన్) : అనన్య నాగళ్ళ (పొట్టెల్)
స్పెషల్ జ్యూరీ అవార్డు (డైరెక్టర్) : సుజీత్, సందీప్ (క)
స్పెషల్ జ్యూరీ అవార్డు (నిర్మాత) : ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
జ్యూరీ స్పెషల్ మెన్షన్ (సింగర్) : ఫరియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)