మన హీరోలు యాక్టింగ్ లోనే కాదు..సింగింగ్ లోనూ మామూళ్లోలు కాదండోయ్. అప్పుడప్పుడు గాయకులుగా కూడా తమ లక్ పరీక్షించుకుంటున్నారు. అంటే సూపర్ స్టార్లు…సూపర్ సింగర్స్ గానూ రాణిస్తున్నారు. తమ స్టార్లు సింగర్స్ గానూ రాణించడంతో ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫాలోఫాలో అంటూ పాడిన పాటకు తన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కేవలం కోలీవుడ్ లోనే కాదు…తెలుగు ఇండస్ట్రీలోనూ ఇప్పుడిదీ ట్రెండ్ గా మారింది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు తమ సొంత సినిమాల కోసం పాటలు పాడుతున్నారు. ధనుష్ నుంచి పవన్ కళ్యాన్ వరకు పాడిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.
ధనుష్
తమిళనాట ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ధనుష్ కేవలం నటనలోనే కాదు..గొప్ప గేయ రచయిత, గాయకుడు, దర్శకుడు కూడా. ధనుష్ 2011లో వై దిస్ కొలవెరి డి అంటూ పాడిన పాట వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యింది. 2004లోపుదుకొట్టైయిలిరుండు శరవణన్ సినిమాలోనాట్టు సరుక్కుతో పాటతో గాయకుడిగా మారాడు. అమ్మా అమ్మ, రౌడీ బేబీ, పూ నీ పూ అనే పాటలు చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
పవన్ కళ్యాణ్
తొలుత తన సినిమాల్లోనే కొన్నింటికి బిట్ సాంగ్ పాడారు పవన్ కళ్యాణ్. 2011లో వచ్చిన పంజా మూవీలో పాపారాయుడు సాంగ్ ద్వారా ప్లే బ్యాక్ సింగర్ గా మారారు. ఈ గ్రూప్ సాంగ్ ను పవన్, హేమచంద్ర, సత్యన్ , బ్రహ్మానందంతో కలిసి పాడారు. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా…కదిరి నరసింహుడా అనే సాంగ్ పాడారు. 2018లో ‘అజ్ఞాతవాసి’ కొడగా కోటేశ్వరరావు అనే పాట పాడారు.
తలపతి విజయ్
తమిళ్ తోపాటు..తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ్. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్రతి తమిళ్ మూవీ తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. 1994లో విజయ్..రసిగన్ సినిమా కోసం ఓ పాట పాడాడు. బాంబే సిటీ సుఖా రొట్టి అనే పాటతో ప్లేబ్యాక్ సింగర్ గా మారాడు విజయ్. ఈ మధ్య కాలంలో వచ్చిన క్రూన్డ్ సినిమాలోని జాలీ ఓఓ జింఖానా పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.
దుల్కర్ సల్మాన్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. 2013లో అమెరికన్ బోర్న్ కన్ఫ్యజ్డ్ దేశీ నుంచి జానీ మోన్ జానీ పాటతో సింగర్ గా కెరీర్ ప్రారంభించాడు. అప్పటి నుంచి మంచి నటుడిగానే కాకుండా గాయకుడిగానూ సత్త చాటాడు. తన మాతృభాషలో ఎన్నో పాటలు పాడిన దుల్కర్ సల్మాన్ తమిళంలోనూ ఓ పాటను పాడారు.
సిద్ధార్థ్
నటుడిగా, సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2006లో ఎవ్రీబడి, ఎదలో ఎపుడు అనే పాటలతో గాయకుడి అవతారమెత్తాడు. ఆతర్వాత బొమ్మరిల్లు మూవీలో అపుడో ఎపుడో అనే పాట సిద్ధార్ధ్ మంచి గుర్తింపునిచ్చింది.
