Suhas Exclusive: శభాష్ సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో దాకా!

చిన్న పాత్రలకే పరిమితమైన సుహాస్ ‘కలర్ ఫోటో’ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.

  • Written By:
  • Updated On - January 28, 2023 / 03:38 PM IST

ఫిబ్రవరి 3, 2023 టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్‌ (Suhas)కి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ కుర్రాడు టైటిల్ రోల్ పోషించిన ‘రైటర్ పద్మభూషణ్’ Writer (Padmabhushan) చిత్రంలో ప్రధాన నటుడిగా మొదటి థియేట్రికల్ మూవీ విడుదల కానుంది. అంతకుముందు చిన్న సినిమాలు, చిన్న పాత్రలకే పరిమితమైన సుహాస్ (Suhas) జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. 2020లో OTT విడుదలైన కలర్ ఫోటో, కులం, తరగతి, వర్ణ పక్షపాతాలతో కూడిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు గీతా ఆర్ట్స్‌ పతాకంపై విడుదల కానున్న సుహాస్‌ తన తాజా చిత్రంతో వెండితెరపై కనిపించబోతున్నాడు. “కలర్ ఫొటోతో స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటానని అనుకున్నప్పుడు, COVID-19 కారణంగా OTT విడుదలకు కావాల్సి వచ్చింది. కానీ జాతీయ అవార్డులలో సినిమా గుర్తింపు పొందినప్పుడు సంతృప్తి లభించింది. ఇప్పుడు నేను మొదటిసారి ప్రధాన నటుడిగా (Main Charatacter) తెరపై చూసుకునేందుకు ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ  విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ సమయంలో నాకు నిద్ర పట్టడం లేదు” సుహాస్ చెప్పారు.

సుహాస్ (Suhas), టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్థి ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ ఫన్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.   ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పనిచేశారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, YouTubeలో దాదాపు 10 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ మూవీ ట్రైలర్  బాగా ఆకట్టుకుంటోంది.

విజయవాడలో (Vijayawada) మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన సుహాస్ ఎలాంటి నేపథ్యం లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించి తన నటనతో తన సత్తాను నిరూపించుకున్నాడు. అది స్నేహితుడైనా, విలన్‌ అయినా లేదా హీరో అయినా తనదైన శైలిలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఎల్లప్పుడూ పక్కింటి అబ్బాయి ఇమేజ్‌ని కలిగి ఉండే సుహాస్ క్రైమ్ థ్రిల్లర్ HIT2 లో విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ కుర్రాడి కోసమే టాలీవుడ్ దర్శకులు ప్రత్యేకమైన స్టోరీలు రాస్తున్నారంటే సుహాస్ స్థాయి ఎంటో ఇట్టే అర్థమవుతోంది.

Also Read: Pathaan box office: బాలీవుడ్ ఈజ్ బ్యాక్.. కేజీఎఫ్, బాహుబలి రికార్డ్స్ బద్దలు!