Site icon HashtagU Telugu

Sankranthi Movies: `బంగార్రాజు`తో సంక్రాంతి బ‌రిలోకి చిన్న హీరోలు

Bangarraju

Bangarraju

`కాలం క‌లిసిరాక‌పోతే..తాడు కూడా పామై క‌రుస్తుంద‌ని.. `సామెత‌. స‌రిగ్గా ఇప్పుడు టాలీవుడ్ కు ఈ సామెత‌ను వ‌ర్తింప చేస్తే..సంక్రాంతి ఈసారి పెద్ద హీరోల‌ను జీరోలుగా చేసింది. చిన్న హీరోల సినిమాల సంద‌డి క‌నిపిస్తోంది. ప్ర‌తి ఏడాది సంక్రాంతి బ‌రిలోకి కోళ్ల పందెం కంటే ఎక్కుడా పెద్ద హీరోల సినిమాల హ‌డావుడి ఉండేది. యావ‌రేజ్ సినిమా కూడా సంక్రాంతి సంద‌ర్భంగా హిట్ జాబితాలోకి వెళ్లేది. ప్ర‌త్యేకించి ఏపీ ప్రేక్ష‌కులు సంక్రాంతి సంద‌ర్భంగా అభిమాన హీరోల సినిమా టిక్కెట్ల‌ను అధిక ధ‌ర‌కు పోటీప‌డి కొనుగోలు చేసే వాళ్లు. ఫ‌లితంగా అనూహ్య లాభాల‌ను పెద్ద హీరోల సినిమాలు రాబ‌ట్టేవి. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ దెబ్బ‌కు హీరోల ప‌రిస్థితి రివ‌ర్స్ అయింది.
టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌తో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు సైతం బ‌య‌ట‌కు రావ‌డంలేదు. సంక్రాంతి సంద‌ర్భంగా మెగా, నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన మ‌ల్టీ స్టార్ హీరోల ‘ఆర్ఆర్ ఆర్‌, బాలీవుడ్ రేంజికి వెళ్లిన ప్ర‌భాస్ ‘రాధే శ్యామ్‌, ప‌వ‌ర్ స్టార్ ‘భీమ్లా నాయక్ విడుద‌ల‌ వాయిదా పడింది. కానీ, హీరో నాగార్జున సినిమా బంగార్రాజు ఈనెల 14న విడుద‌ల కానుంది. ఇక‌ చిన్న హీరోలు న‌టించిన‌ సినిమాల విడుద‌ల థియేట‌ర్ల‌కు పండ‌గ సంద‌డిని ఇస్తున్నాయి.
ప్ర‌తి ఏడాది సంక్రాంతికి హీరో నాగార్జున మార్క్ సినిమా విడుద‌ల ఆనవాయితీ. ఈసారి కూడా బంగార్రాజు సినిమా విడుద‌ల అవుతోంది. టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ ఉన్న‌ప్ప‌టికీ త‌న సినిమాకు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని నాగార్జున విశ్వ‌సిస్తున్నాడు. ఇక చిన్ని సినిమాలు జాబితాలో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘రౌడీ బాయ్స్’ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ‘హీరో’ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి` చిత్రం నెల 14న విడుదలవుతోంది. ఈ చిత్రంలో రియా చక్రవర్తి, రుచితా రామ్ హీరోయిన్లుగా నటించారు. ప్రిన్స్, నేహ జంటగా నటించిన ‘ది అమెరికన్ డ్రీమ్’ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం ఆహా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.