Site icon HashtagU Telugu

AAA : బన్నీ సరసన ఐదుగురు హీరోయిన్లా..?

Allu Atlee Movie

Allu Atlee Movie

అల్లు అర్జున్‌ – అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ, ఇప్పటికే సోషల్ మీడియా లో #AAA హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండటంతో ఈ సినిమా వార్తల్లో హైలైట్ అవుతుంది. బన్నీ పుట్టినరోజున ఈ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాలో అట్లీ ఐదుగురు హీరోయిన్స్‌ను తీసుకోవాలని చూస్తున్నాడన్న టాక్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కథలో ప్రత్యేకత ఉండటంతో ఐదుగురు నటీమణులు అవసరం అయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Tollywood : ఫస్ట్ టైం తెలుగులో భారీ చిత్రం చేయబోతున్న అగ్ర సంస్థ..! హీరో ఎవరో తెలుసా..?

ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్‌ ఎంపికైందన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న ఆమె, బన్నీ సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌, గ్లోబల్‌ ఐకాన్‌ ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో కనిపించబోతుందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అట్లీ స్వయంగా ప్రియాంకను సంప్రదించాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది. దీనితో ఆమె టాలీవుడ్‌ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు అర్థమవుతోంది.

అయితే ప్రియాంక లాంటి హాలీవుడ్‌ స్థాయి నటి బన్నీ సినిమాలో పూర్తి పాత్రలో నటిస్తుందా లేక గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమేనా అనేది స్పష్టతలేదు. ప్రియాంక వంటి బిజీ నటిని ఎక్కువ డేట్స్ ఇవ్వమన్నా సాధ్యం కాదని మేకర్స్‌ కూడా గ్రహించినట్టే. కాబట్టి ఆమె పాత్ర కాస్త చిన్నదిగా ఉండొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ, ప్రియాంక పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ, మిగిలిన ముగ్గురు హీరోయిన్‌ల వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ విషయాల్లో పూర్తి స్పష్టత బన్నీ బర్త్‌డే సందర్భంలో అధికారిక ప్రకటనతో రానుందని అభిమానులు ఆశిస్తున్నారు.