చిత్రసీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు తప్పించి ఒకరోజు ఎవరో ఒకరు కన్నుమూస్తున్నారు. ముందుగా కీరవాణి తండ్రి శివ శక్తి దత్త, నెక్స్ట్ సరోజాదేవి , నెక్స్ట్ కోట శ్రీనివాస్ రావు , ఆ తర్వాత రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు, నేడు ఫిష్ వెంకట్ (Fish Venkat) (53). గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆరోగ్యం విషమించి చందానగర్లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
Star Fruit : మూత్ర పిండాల సమస్య ఉన్న వారు స్టార్ ఫ్రూట్ తింటున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
ఫిష్ వెంకట్ వైద్యం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తన వంతుగా సాయం అందించారు. ఫిష్ వెంకట్ కోలుకొవాలని కోరుకున్నారు. కానీ ఈ విధంగా జరగటంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన తెలంగాణ యాస, హాస్య టైమింగ్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు ఫిష్ వెంకట్. 2000వ ఏడాదిలో ‘ఖుషి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి పలు సూపర్‌హిట్ చిత్రాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. కామెడీ పాత్రలతో పాటు కొన్ని చిత్రాల్లో విలన్ పాత్రలకూ ప్రాధాన్యం ఇచ్చి నటనలో తన ప్రత్యేకతను చాటారు.
Hydraa : జోరు వానను సైతం లెక్క చేయని హైడ్రా కమిషనర్..నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటన
గత తొమ్మిది నెలలుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్‌కు వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సూచించారు. ఈ ఆపరేషన్‌కు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆయన కుమార్తె స్రవంతి వెల్లడించారు. కొంతమంది అభిమానులు, ప్రముఖులు సహాయం అందించినప్పటికీ, తగిన కిడ్నీ దాత అందుబాటులోకి రాకపోవడంతో చికిత్స ఆలస్యమైంది. ఈ క్రమంలో ఫిష్ వెంకట్ ఆరోగ్యం మరింత క్షీణించి, తుదిశ్వాస విడిచారు.
ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన హైదరాబాద్‌లో భార్య సువర్ణ, కుమార్తె స్రవంతితో నివసించేవారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు, సహనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన చేసిన హాస్య పాత్రలను గుర్తు చేసుకుంటున్నారు.