NOC Certificate: అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమా యానిమల్. ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ప్రస్తతుం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోస్టర్ విడుదల అయింది.
ఒంటి నిండా రక్తం, చేతితో గొడ్డలితో రణబీర్ కపూర్ ఈ పోస్టర్ లో కనిపించాడు. గుబురు గడ్డంతో ఇందులో కనిపించాడు. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ స్లిప్ రిలీల్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమాను 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు చూడాలంటే తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ తీసుకురావాలి. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకు ఎన్వోసీ సర్టిఫికేట్ జారీ చేయలేదు. తొలిసార ఈ సినిమాకే జారీ చేయనున్నారు. ఈ సినిమాలో వైలెన్స్ బాగా ఎక్కువగా ఉందని టాక్. అందుకే మైనర్లు చూడాలంటే తల్లిదండ్రుల సంతకం చేసిన పేపర్ ను తీసుకొచ్చి థియేటర్ కు రావాల్సి ఉంటుంది.
ఎన్వోసీ సర్టిఫికేట్ పై సినిమా యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమాలో రొమాన్స్ సన్నివేశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రణబీర్ కూపర్, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.