Tillu Square : DJ టిల్లు 2 వచ్చేశాడు.. అనుపమతో ఓపెన్ గా ఫ్లర్టింగ్ చేస్తున్న టిల్లు..

ఈ సినిమాకి టిల్లు స్క్వేర్ అంటూ వెరైటీగా టైటిల్ పెట్టారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ప్రోమో అని చెప్పి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
first song promo released from Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie

first song promo released from Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie

సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), నేహా శెట్టి(Neha Shetty) జంటగా గత సంవత్సరం వచ్చిన DJ టిల్లు సినిమా సూపర్ హిట్ అయింది. చిన్న సినిమా అయినా కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా, మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి DJ టిల్లు 2 పై ఆసక్తి పెంచారు. ఈ సినిమాకి టిల్లు స్క్వేర్ అంటూ వెరైటీగా టైటిల్ పెట్టారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ప్రోమో అని చెప్పి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.

టిల్లు స్క్వేర్ నుంచి రిలీజయిన ఈ ప్రోమోలో.. ఓ పార్టీలో హీరో అనుపమని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేకపోతే నేను తీసుకుపోతా అంటూ మాట్లాడితే.. ఇప్పుడేగా కలిసింది అప్పుడే ఓపెన్ గానే ఫ్లర్ట్ చేస్తున్నావా అంటూ అనుపమ అడగడంతో.. ఓపెన్ గా చేస్తేనే కదా నీకు తెలిసేది అంటూ సమాధానం ఇస్తాడు సిద్ధూ. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. చివర్లో పోయినసారి అంత జరిగినా టిల్లు అన్నకి సిగ్గు రాలే అంటూ సెటైర్ వేశారు. సిద్ధూ, అనుపమ మధ్య కొంచెం రొమాంటిక్ టాక్ తో ఈ ప్రోమో సాగింది. టికెట్ కొనకుండానే.. అంటూ సాగే ఈ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

Also Read : KA Paul : ఓపెన్‌హైమర్ సినిమా చూసిన KA పాల్.. లైఫ్‌లో మొదటి సారి సినిమా చూశాను అంటూ..

  Last Updated: 24 Jul 2023, 08:27 PM IST