Site icon HashtagU Telugu

Prabhas Project K: ప్రాజెక్టు కె మూవీలో ప్రభాస్‌ లుక్‌ రిలీజ్.. ఫస్ట్ లుక్ పై పేలుతున్న కామెంట్స్

Project

Project

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’ వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమాలో ప్రభాస్‌ ఎలా కనిపించనున్నాడోనని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు మూవీ మేకర్స్‌.. తాజాగా ప్రభాస్‌ లుక్‌ను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ పై మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ తలను అతికించడానికి ఇంత టైమ్ పట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆదిపురుష్ మూవీ లాగే ప్రాజెక్టు కె ఖతమ్ అంటూ విమర్శలు చేస్తున్నారు.  ప్రభాస్ లుక్ అందిరిందని, అచ్చం ఐరన్ మ్యాన్ లా ఉన్నారని మరికొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. సినిమా అంతా ప్రభాస్ ఈ లుక్ లోనే కనిపిస్తాడా లేక, కథ ప్రకారం, ఈ ఎపిసోడ్ లోనే ఇలా కనిపిస్తాడా అనేది తేలాల్సి ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ చూస్తే, మరో గ్రహంలో ప్రభాస్ ను చూపించినట్టు ఉంది. ఈ ఫస్ట్ లుక్ కు “హీరో రైజెస్, ది గేమ్ ఛేంజెస్” అనే క్యాప్షన్ తగిలించారు.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారంతా ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas)తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుండటం విశేషం. ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ భారత్‌లో జూలై 21న, అమెరికాలో జూలై 20న విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డ్‌ను క్రియేట్ చేయబోతోంది.

Also Read: Janhvi Kapoor: ఎద అందాలతో జాన్వీ గ్లామర్ ట్రీట్.. వింటేజ్ గౌనులో మత్తెక్కిస్తున్న అందాలు!