Site icon HashtagU Telugu

Kalyan Ram : కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్‌లో అగ్ని ప్రమాదం.. నిర్మాతకు భారీ నష్టం..

Fire Accident Took Place In Nandamuri Kalyan Ram Nkr21 Movie Sets

Fire Accident Took Place In Nandamuri Kalyan Ram Nkr21 Movie Sets

Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ని హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్ చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ ని దాదాపు రూ.4 కోట్లతో నిర్మించారట.

మూవీలోని కీలక సన్నివేశాలు అయిన సీబీఐ సీన్స్‌ని.. చిత్ర యూనిట్ ఆ ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఆ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందట. ఇప్పటికే ఆ సెట్ లో తొమ్మిది రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకోగా.. చివరి రోజు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమి కలగలేదు గాని, మొత్తం 4 కోట్ల సెట్ అంతా బూడిద అయ్యిపోయిందట. దీంతో నిర్మాతకు భారీగానే నష్టం కలిగింది. కాగా ఇప్పుడు ఆ చివరి రోజు షూటింగ్ కోసం.. మూవీ టీం ఏం చేయాలో తెలియక తికమకలో పడింది.

కాగా ఈ సినిమా దర్శకుడు ప్రదీప్ గతంలో ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా చేసారు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా మాస్ టేకింగ్ లో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాని కూడా పూర్తి మాస్ బొమ్మగా తీసుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘అశోక క్రియేషన్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.