Kiran Abbavaram : అప్పుడప్పుడు సినిమా వాళ్ళు ప్రమోషన్స్ లో భాగంగా ఆడియన్స్ కి ఆఫర్స్ ఇస్తారని తెలిసిందే. తాజాగా హీరో కిరణ్ అబ్బవరం ఓ సరికొత్త ఆఫర్ తో వచ్చాడు. ఇటీవల క సినిమాతో భారీ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు దిల్ రూబా సినిమాతో రాబోతున్నాడు. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సరెగమ సంయుక్త నిర్మాణంలో విశ్వ కరుణ్ దర్శకత్వంలో దిల్ రూబా సినిమా తెరకెక్కింది.
దిల్ రూబా సినిమా మార్చ్ 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఓ ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్ గురించి ఓ వీడియో రిలీజ్ చేసాడు.
కిరణ్ అబ్బవరం ఈ వీడియోలో మాట్లాడుతూ.. దిల్ రూబా సినిమా ప్రేమ, కోపం గురించి. నా ప్రేమ ఈ బైక్. సినిమాలో నేను వాడింది. దీన్ని మా ఆర్ట్ డైరెక్టర్ స్పెషల్ గా చేయించాడు. ఈ బైక్ మీకు మార్కెట్ లో దొరకదు. అందుకే ఇది మీకు ఇద్దామనుకుంటున్నాను. ఇప్పటివరకు మేము రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ చూసి ఈ సినిమా కథేంటి అని కరెక్ట్ గా గెస్ చేసిన వారికి మేమే పిలిచి ఈ బైక్ గిఫ్ట్ గా ఇస్తాము. అలాగే ఈ బైక్ గెలుచుకున్న వారితో మొదటి రోజు మొదటి ఆటకు ఈ బైక్ మీద వస్తాను, సినిమా చూస్తాను. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా పాల్గొనచ్చు అని చెప్పారు.
ఈ కథని గెస్ చేసిన వాళ్ళు #Dilruba తో ట్విట్టర్ లో ఆ కథ ప్లాట్ పోస్ట్ చేయాలి. కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్లకు దిల్ రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బైక్ ని ఇస్తామని వీడియోలో ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం దిల్ రూబా కథ గెస్ చేసి ఈ రేర్ బైక్ ని గెలుచుకోండి.
Eee Bike Meede ❤️#Dilruba #DilrubaFromMarch14th pic.twitter.com/v1qpbMrsJU
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 2, 2025
Also Read : Thandel : నాగ చైతన్య, సాయి పల్లవి ‘తండేల్’ ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో తెలుసా..