Ramabanam : హమ్మయ్య.. ఆ ఫ్లాప్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి.. డేట్ ఫిక్స్..

ప్రస్తుతం హిట్ సినిమాలు కూడా నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఫ్లాప్ సినిమాలు అయితే రెండు వారాల్లోనే వచ్చేస్తున్నాయి. కానీ ఇన్ని నెలలు అవుతున్నా రామబాణం ఓటీటీలోకి రాలేదు.

Published By: HashtagU Telugu Desk
Finally Ramabanam Movie coming to OTT Date and Streaming Platform Details Here

Finally Ramabanam Movie coming to OTT Date and Streaming Platform Details Here

మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) ఇటీవల సమ్మర్(Summer) లో రామబాణం(Ramabanam) అనే సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ పరాజయం పాలైంది. శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చి హిట్ అవ్వగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని అంతా భావించారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, కుష్బూ ముఖ్య పాత్రలు పోషించారు.

మే 5న థియేటర్స్ లో రిలీజయిన రామబాణం సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం హిట్ సినిమాలు కూడా నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఫ్లాప్ సినిమాలు అయితే రెండు వారాల్లోనే వచ్చేస్తున్నాయి. కానీ ఇన్ని నెలలు అవుతున్నా రామబాణం ఓటీటీలోకి రాలేదు. ఈ ఫ్లాప్ సినిమా ఏంటి ఇంకా ఓటీటీలోకి రాలేదు అని అంతా అనుకున్నారు.

తాజాగా రామబాణం సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 14 నుంచి రామబాణం సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. మరి ఈ ఫ్లాప్ సినిమా ఓటీటీలోనైనా మెప్పిస్తుందా చూడాలి. ఇక కొంతమంది అయితే హమ్మయ్య.. ఈ ఫ్లాప్ మూవీ ఇప్పటికైనా వచ్చింది అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Shah Rukh Khan: షారుక్ ఖాన్ మేనేజర్ పూజా ఆస్థి ఎంతో తెలుసా?

  Last Updated: 07 Sep 2023, 07:39 PM IST