టాలీవుడ్ దర్శకురాలు, రచయిత అపర్ణ మల్లాది (Aparna Malladi) (54) కాన్సర్ (Cancer ) తో పోరాడి కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికా లో చికిత్స పొందుతున్న ఆమె జనవరి 2న తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌లో తన సృజనాత్మక రచనలతో గుర్తింపు పొందిన అపర్ణ మల్లాది మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అపర్ణ మల్లాది సినీ కెరీర్‌ను “ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్” చిత్రంతో ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు చిత్రసీమలో ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. తర్వాత ఆమె రూపొందించిన వెబ్ సిరీస్ “పోష్ పోరిస్” సూపర్ హిట్ అయింది. ఈ సిరీస్‌లో అద్భుతమైన కథ, కథనాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. రెండేళ్ల క్రితం ఆమె దర్శకత్వంలో వచ్చిన “పెళ్లి కూతురు పార్టీ” (Pellikuturu Party (2022)) సినిమా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రిన్స్, అనీషా, భావన ప్రధాన పాత్రలు పోషించారు. అపర్ణ మల్లాది డైరెక్ట్ చేయడమే కాకుండా, పలు చిత్రాలకు కథలు కూడా అందించారు. ఆమె రచనలో కొత్తదనంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉండేది. ఆమె సృజనాత్మకత తెలుగు సినీ రంగానికి ఎనలేని కీర్తిని తెచ్చింది.
Balayya : ‘డాకు మహారాజ్’ మూడు చోట్ల ప్రీ రిలీజ్ వేడుకలు
అపర్ణ మల్లాది మృతిపై ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. “ఆమె రచనలు, సినిమాలు తెలుగు చిత్రసీమకు చిరస్మరణీయంగా ఉంటాయి” అంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతూ , సంతాపం వ్యక్తం చేస్తున్నారు.