Site icon HashtagU Telugu

Filmfare Awards 2022 : తగ్గేదేలే అంటూ హవా చూపించిన అల్లు అర్జున్..!!

Pushpa2

Pushpa2

ద‌క్షిణాదికి చెందిన 67వ‌ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022ను ఆదివారం బెంగుళూరు లోని ఇంటర్నేష‌న‌ల్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ద‌క్షిణాదికి చెంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఈ వేడుక‌లో మెరిశారు. తెలుగులో పుష్ప ది రైజ్ సినిమా, త‌మిళంలో సూర‌రై పోట్రు (ఆకాశం నీ హ‌ద్దురా) సినిమాల జోరు కొనసాగింది.

పుష్ప టాప్ గా నిలిచింది
ఈ అవార్డ్ షోలో, పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. అదే చిత్రానికి గానూ దర్శకుడు సుకుమార్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది. ఈ చిత్రానికి గానూ దేవిశ్రీ ప్రసాద్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.

పూజా హెగ్డే ఉత్తమ నటిగా
తేజ సజ్జకు బెస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ అవార్డు వచ్చింది. దీనితో పాటు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి గానూ పూజా హెగ్డే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. రాబర్డ్ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ సుధీర్ కూడా అవార్డ్ అందుకున్నాడు.

కమల్ హాసన్ పాన్ ఇండియా స్టార్
నటుడు శ్రీకాంత్‌కు ప్రతికూల పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. దీంతో పాటు ఈ ఏడాది బెస్ట్ ఎంటర్‌టైనర్ అవార్డు కూడా సాయి పల్లవికి దక్కింది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాలకు గాను ఆమె ఈ గౌరవం దక్కింది. పుష్పలో నటించిన రష్మిక మందన్నకు ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డు లభించింది. కమల్ హాసన్ ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ అవార్డును అందుకున్నారు.