Site icon HashtagU Telugu

Hyderabad Drugs : రేవ్ పార్టీ లో ఫైనాన్స్ వెంకట్ అరెస్ట్.. టాలీవుడ్ లో అలజడి స్టార్ట్

Electin Drugs

Film Producer Venkat Arrested in Drugs Case

మాదాపూర్ లో రేవ్ పార్టీ (Rave Party)ని భగ్నం చేసిన పోలీసులు..ఇప్పుడు ఈ కేసుకు సంబదించిన విషయాలను బయటకు రాబట్టే పనిలో ఉన్నారు. మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ తో పాటు డ్రగ్స్ (Drugs) ను వాడుతున్నారని పక్క సమాచారం అందుకున్న పోలీసులు , నార్కోటిక్ బ్యూరో అధికారులు ఒక్కసారిగా ఆ అపార్ట్ మెంట్ ఫై దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ సేవిస్తూ పలువురు సినీ ప్రముఖులు (Cine Stars) పట్టుబడ్డారు. ఇందులో సినిమా ఫైనాన్స్ వెంకట్ (Film Producer & Financer Venkat) ఉన్నారు. డమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్ సూర్య తదితర సినిమాలకు వెంకట్ ఫైనాన్సర్ గా వ్యవహరించారు. వెంకట్ అరెస్ట్ తో ఇప్పుడు చిత్రసీమలో అలజడి మొదలైంది. వెంకట్ తో పాటు బాలాజీ, వెంకటేశ్వర రెడ్డి, మురళి, మధుబాల, మెహక్ లు డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుబడ్డారు.

డ్రగ్స్ దందాలతో పాటు వెంకట్ ,బాలాజీ వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కు బానిసైన వెంకట్..దానిని వ్యాపారంగా మార్చుకొని డబ్బు సంపాదిస్తున్నారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు వెంకట్ నిర్వయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. సర్వీస్ అపార్ట్ మెంట్ లలో వెంకట్ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తూ వస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోని బలాలు, బలహీనతలపై బాగా అవగాహన ఉన్న వెంకట్.. దాన్నే అవకాశంగా తీసుకుని ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడనే అతను ఇస్తున్న రేవ్ పార్టీలే సాక్ష్యంగా కనిపిస్తుంది. మూడు నెలలు రెక్కీ నిర్వహించి మరీ పట్టుకున్నారంటే.. వెంకట్ నెట్ వర్క్ ఎంత పెద్దదో అర్థం అవుతుంది.

Read Also : YS Sharmila : కేసీఆర్..నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ – షర్మిల మాస్ వార్నింగ్

ఇక వెంకట్ ను విచారిస్తున్న పోలీసులు ఆయన ఫోన్ చాట్ ను గమనిస్తున్నారు. వెంకట్ దగ్గరి నుండి పెద్ద ఎత్తున చిత్రసీమలో కొంతమంది డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు వాట్స్ ప్ చాట్ లో తేలడం తో పోలీసులు వారికీ నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు. గతంలో టాలీవుడ్‌ నిర్మాత కేపీ చౌదరి (Producer KP Chowdary ) డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన విచారించడగా టాలీవుడ్ కు చెందిన పలువురు ఆర్టిస్టుల పేర్లను ప్రస్తావించారు. కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వారు తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు సినీ ప్రముఖులను అరెస్టు చేయడం సినీ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ కేసులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో..ఎంతమందిని అదుపులోకి తీసుకుంటారో చూడాలి.