Site icon HashtagU Telugu

Film Fare Awards South 2023 : ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్స్ చరణ్, ఎన్టీఆర్.. 7 అవార్డులతో RRR హంగామా..!

Film Fare Awards South 2023 Best Actors Ram Charan Ntr

Film Fare Awards South 2023 Best Actors Ram Charan Ntr

2023 సంవత్సరానికి గాను ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల (Film Fare Awards South) ప్రకటించారు. అనుకున్న విధంగానే ఆర్.ఆర్.ఆర్ సినిమాకు అవార్డుల పంట పడింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఒకటి రెండు కాదు ఏకంగా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరికి ఆ అవార్డ్ ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ (Komaram Bheem) గా తారక్, సీతారామరాజు (Seetharamaraju)గా చరణ్ అదరగొట్టారు. ఇక బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళికి కూడా ఫిల్మ్ ఫేర్ ప్రకటించారు.

ఇవే కాకుండా బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బం కేటగిరిలో ఎం.ఎం కీరవాణికి ఫిల్మ్ ఫేర్ వరించింది. ఇక క్రిటిక్స్ చాయిస్ గా బెస్ట్ మూవీగా సీతారామం అవార్డ్ అందుకోనుంది. ఐతే బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరిలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఫిల్మ్ ఫేర్ వరించింది. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో ఆమె చూపించిన అభినయం అందరికీ నచ్చింది.

సీతామం సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ కి క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ హీరో అవార్డ్ అందింది. క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ మూవీగా కూడా సీతారామం ఎంపికైంది. బెస్ట్ లిరిక్స్ గా సిరివెన్నెల సీతారామశాస్త్రి సీతారామ సినిమాలోని కానున్న కళ్యాణం, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద ఓ ప్రేమ సాంగ్ కి ఫిల్మ్ ఫేర్ వరించింది.

ఇక బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమలో నటించిన రానాకి అవార్డ్ ప్రకటించారు. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ లో నందితా దాస్ విరాటపర్వం సినిమా నుంచి ఎంపికైంది. క్రిటిక్స్ బెస్ట్ హీరోయిన్ గా విరాట పర్వం సినిమా నుంచి సాయి పల్లవి ఎంపికైంది. సో బెస్ట్ యాక్టర్స్ గా ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు కలిసి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని షేర్ చేసుకోబోతున్నారు. సో ఆర్.ఆర్.ఆర్ హీరోలు మరోసారి కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడంతో పాటుగా అవార్డుని కూడా పంచుకోవడం ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందని చెప్పొచ్చు.