Site icon HashtagU Telugu

Ratan Tata : రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు

Celbs Tat

Celbs Tat

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Naval Tata ) (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్త తెలిసి అన్ని రంగాలవారు నివాళ్లు అర్పిస్తూ..ఆయన విజయాలు , ఆయన చేసిన సేవ , సహాయాలు గురించి మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు , బిజినెస్ వర్గీయులు తమ సంతాపాన్ని తెలియజేయగా..సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా నివాళ్లు అర్పిస్తున్నారు. చిరంజీవి , జూ. ఎన్టీఆర్ , రాజమౌళి , రజనీకాంత్, నాగార్జున తదితరులు నివాళ్లు అర్పించారు.

‘భారతీయులకు ఇది బాధాకరమైన రోజు. సేవలో రతన్‌టాటాను మించినవారు లేరు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. మెగా ఐకాన్‌. నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి. అసాధారణ మానవుడు. టాటా బ్రాండ్‌లను గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా నిర్మించడమే కాకుండా మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారు. మనం ఒక మంచి మనస్సున్న వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు తరాలకు స్ఫూర్తినిస్తాయి, మార్గాన్ని నిర్దేశిస్తాయి. రతన్‌ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ – చిరంజీవి

‘రతన్‌టాటా ఓ లెజెండ్‌. మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టం. ఎన్నోతరాలకు స్ఫూర్తి. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఆరాధకుడినే. జైహింద్’ – రాజమౌళి

‘రతన్‌ టాటాది బంగారంలాంటి హృదయం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. దూరదృష్టి గల వ్యక్తి. ఎంతోమంది జీవితాలను మార్చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ – ఎన్టీఆర్‌

‘శ్రీ రతన్ టాటాజీ, ఇండియా మిమ్మల్ని మిస్ అవుతోంది. మీ కరుణ, నాయకత్వం! రెస్ట్ ఇన్ పీస్ సర్’- నాగార్జున అక్కినేని

‘నాయకత్వం, దాతృత్వం, నైతికతకు రతన్ టాటా ఓ చిహ్నం! ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. భారతదేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది’ – రానా దగ్గుబాటి

‘రతన్ టాటాజీ, మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మీరు నిజమైన లెజెండ్, ట్రూ ఐకాన్’- దేవీశ్రీ ప్రసాద్