Samantha : సినీ నటి సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలియజేశారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న”అంటూ హృదయాన్ని కదిలించే క్యాప్షన్ తో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే జోసెఫ్ ప్రభు మరణవార్తకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.
ఇక రేపు చెన్నైలో జోసెఫ్ ప్రభు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. గతంలో తన తండ్రితో తనకు ఎటువంటి అనుబంధం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రేడింగ్ లోకి వచ్చాయి. తన సినీ కెరియర్ లో ఆయన ఎంత మద్దతుగా ఉన్నారు అనే విషయంను కూడా సమంత వివరించింది. అందుకే ఆమె సినిమా షూటింగ్స్ లో కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని చూసేవారు.
ఇక కొన్నాళ్లుగా సమంతకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడాకులు, ఆ తర్వాత మయోసైటిల్ వ్యాధితో ఇబ్బంది పడుతూ.. దాని చికిత్స నిమిత్తం సినిమాలకు సైతం దూరంగా ఉన్న సమంత.. ఈ మధ్యనే మళ్లీ కాస్త రికవరీ అయినట్లుగా కనిపిస్తోంది. ఇక సమంత ఇటీవల బాలీవుడ్ లో సీటాడెల్: హాని బన్నీ లో నటించిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రమోషన్ లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంది. ఇక హఠాత్తుగా ఈ తరహా ఘటన జరగడంతో ఆమె ఒక్కసారిగా మనోవేదనకు గురయ్యారు. ఇక చివరగా తెలుగులో యశోద – శకుంతలం – ఖుషి సినిమాలలో నటించింది.