ఫిబ్రవరిలో సాధారణంగా సినిమాలు తక్కువ రిలీజ్ చేస్తారు. ఆ టైం లో ఎలాంటి హాలీడేస్ ఉండవు. అయితే ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. సంక్రాంతి సందడి తర్వాత ఫిబ్రవరి లో అది కూడా ప్రేమికుల రోజు సినిమాల హడావిడి ఉండబోతుంది.
ఫిబ్రవరి మొదటి వారం లో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమా రిలీజ్ అవుతుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ లాక్ చేశారు. ఇక ఫిబ్రవరి 14న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. విశ్వక్ సేన్ లెడీ గెటప్ తో చేసిన సినిమా నుంచి టీజర్ రాగా అది ఆకట్టుకుంది.
సినిమా టీజర్ కూడా ఇంప్రెస్..
ఇక విశ్వక్ తో పాటు దిల్ రూబా అంటూ కిరణ్ అబ్బవరం సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టీజర్ కూడా ఇంప్రెస్ చేసింది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతం తో కలిసి చేసిన బ్రహ్మా ఆనందం కూడా ఫిబ్రవరి 14న వస్తుంది.
వీటితో పాటుగా ధన్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రామం రాఘవం సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సో తెలుగు ఆడియన్స్ కు ఫిబ్రవరి 14న కూడా సినిమాల పండగగా ఉండబోతుంది. మరి ఈ సినిమాలు ఆడియన్స్ ని ఏమేరకు ఎంటర్టైన్ చేస్తాయన్నది చూడాలి.