Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ ఒక పెద్ద చెఫ్ టీంతో ట్రావెల్ చేస్తుంటారు.. ఫరియా అబ్దుల్లా

Faria Abdullah Interesting Comments About Prabhas In Aa Okkati Adakku Promotions

Faria Abdullah Interesting Comments About Prabhas In Aa Okkati Adakku Promotions

Prabhas – Faria Abdullah : టాలీవుడ్ చిట్టి ఫరియా అబ్దుల్లా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఫరియా.. ప్రభాస్ గురించి పలు కామెంట్స్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు. ‘జాతిరత్నాలు’ సినిమా సమయంలో ఫరియా, ప్రభాస్ ని కలుసుకున్న విషయం తెలిసిందే. దీంతో తాజా ఇంటర్వ్యూల్లో ప్రభాస్ తో మీటింగ్ గురించి, ప్రభాస్ గురించి ప్రశ్నలు అడుగుతుండగా.. ఫరియా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు.

ప్రభాస్ తో మీటింగ్ గురించి మాట్లాడుతూ.. “ఆయన ఎంతో పెద్ద స్టార్. అలాంటి ఆయన నాలాంటి యాక్టర్స్ తో కూడా చాలా సింపుల్ గా మాట్లాడుతారు. ఒకవేళ నేను ఎక్కడైనా కనిపించాను అనుకోండి.. హే ఫరియా ఎలా ఉన్నావు అంటూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తారు. ఆయన అలా మాట్లాడుతుంటే.. ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ అనే ఫీలింగ్ మనకి రాదు. ఎంత ఎదిగిన ఒదిగే ఉంటారు. ఆయనలో ఆ విషయం నాకు బాగా నచ్చేసింది. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఫుడ్ పెట్టి తన ఆతిథ్యంతో అందర్నీ చంపేసే ప్రభాస్.. మీకు ఎలాంటి ఫుడ్ పెట్టారు..? ఆ అనుభవం ఎలా ఉందని ప్రశ్నించగా, ఫరియా బదులిస్తూ.. “అది ఎప్పటికి మరచిపోలేము అండి. ప్రభాస్ గారు ఎప్పుడూ ఒక పెద్ద చెఫ్ టీంతో ట్రావెల్ చేస్తారు. మాస్టర్ చెఫ్, అసిస్టెంట్ చెఫ్ ప్రభాస్ వెంటే ఉంటారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ ఒక్కటి అడక్కు సినిమా విషయానికి వస్తే.. అల్లరి నరేష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్నారు. రాజేష్ చిలకా నిర్మిస్తున్న ఈ మూవీ మే 3న రిలీజ్ కాబోతుంది. అల్లరి నరేష్ నుంచి చాలా గ్యాప్ తరువాత వస్తున్న కామెడీ డ్రామా మూవీ ఇది. నరేష్ అండ్ ఫరియా కాంబోతో పాటు సాంగ్స్, ట్రైలర్ అండ్ టీజర్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.