Site icon HashtagU Telugu

Faria Abdhulla : యాక్షన్ సినిమాలు చేయాలని ఉందంటున్న జాతిరత్నం..!

Faria Abdhulla Interest To Do Action Movies

Faria Abdhulla Interest To Do Action Movies

Faria Abdhulla జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా పరిచయమైన ఫరియా అబ్దుల్లా ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ఆ తర్వాత అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. యువ హీరోలతో జత కడుతూ కెరీర్ కొనసాగిస్తున్న ఫరియా లేటెస్ట్ గా అల్లరి నరేష్ తో ఆ ఒక్కటీ అడక్కు సినిమా చేసింది. పెళ్లి కానీ అబ్బాయిల మీద మాట్రిమోనీ వాళ్లు చేసే మోసాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది.

ఈ సినిమాలో తన పాత్ర గురించి మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న ఫరియా ఈ సినిమాలో నటించడం వల్ల తను చాలా విషయాలు తెలుసుకున్నానని అన్నారు. బయట ఉన్న తనకు ఈ పాత్రకు కాస్త దగ్గర పోలికలు ఉన్నాయని అన్నది. అల్లరి నరేష్ తో కలిసి నటించడం లక్కీగా ఫీల్ అవుతున్నానని చెప్పిన ఫరియా తనకు కెరీర్ లో ప్రయోగాలు చేయాలని ఉందని అంటుంది.

యాక్షన్ సినిమాలు చేయాలని ఉందని అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అంటుంది ఫరియా. అన్ని జోనర్ సినిమాలు చేయాలని ఉందని. హీరోయిన్ గానే కాకుండా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది ఫరియా అబ్ధుల్లా. జాతిరత్నాలు తర్వాత ఒక రేంజ్ లో దూసుకెళ్తుందని ఊహించిన ఫరియా కెరీర్ నత్త నడక నడుస్తుందని చెప్పొచ్చు.

అల్లరి నరేష్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తన పంథాలో చేసిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. ఈ సినిమా మే 3న రిలీజ్ చేస్తున్నారు. నరేష్ తో పాటుగా ఫరియా అబ్ధుల్లా కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.