Site icon HashtagU Telugu

Vijay Vs Ajith: చెన్నైలో ‘స్టార్’ వార్.. విజయ్, అజిత్ అభిమానులపై లాఠీచార్జి!

Vijay And Ajith

Vijay And Ajith

తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar), విజయ్ దళపతి (Vijay Thalapathy) కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి సినిమాలో గతంలో ఎన్నోస్లారు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. తాజాగా మరోసారి ఈ బిగ్ స్టార్స్ కు సంబంధించిన సినిమాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. విజయ్ ‘వరిసు’, అజిత్ ‘తునివు’ పోస్టర్లను చింపడంతో హింసాత్మకంగా మారింది. గ్రేటర్ చెన్నై (Chennai) పోలీసులు బుధవారం తెల్లవారుజామున లాఠీచార్జి చేశారు. ఈ ఘటనతో అటు విజయ్, అటు అజిత్ ఫ్యాన్స్ గాయపడ్డారు.

ఈ రెండు సినిమాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో భారీ హడావిడి కనిపించింది. ముఖ్యంగా 2014లో విజయ్, (Ajith) అజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరమ్’ విజయ్ (Vijay) నటించిన ‘జిల్లా’తో ఒకే రోజు విడుదలైంది. దాదాపు తొమ్మిదేళ్ల ఇద్దరు స్టార్స్ ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో సందడి నెలకొంది. అయితే, తమిళనాడు ప్రభుత్వం స్టార్‌ల భారీ కటౌట్‌లపై పాలాభిషేకం నిషేధించింది. పొంగల్ పండుగ జనవరి 15 నుంచి 18 మధ్య జరగనున్న నేపథ్యంలో సినిమా షోల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ గట్టి నిఘాను ఉంచింది.