Site icon HashtagU Telugu

Kajal Fans Upset: ఆచార్య.. ట్రైలర్ లో ‘కాజల్’ ఎక్కడ?

Kajal

Kajal

చిరంజీవి, రామ్ చరణ్‌లు నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ‘ఆచార్య’ మూవీ టీం ఇటీవలే రిలీజ్ చేసింది. మహిళా కథానాయికలలో ఒకరైన కాజల్ అగర్వాల్ ట్రైలర్‌లో ఎక్కడా కనిపించకపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. కాజల్‌ను ట్రైలర్‌లో చూస్తారని ఊహించిన కాజల్ అభిమానులు ఆమె లేకపోవడంతో అప్ సెట్ అయ్యారు. “2.33 నిమిషాల ట్రైలర్‌లో, కాజల్ పాత్ర గురించి కనీసం ఒక్క సీన్ కూడా లేకపోవడంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సినిమాలో కాజల్ పాత్ర కట్ అయిందా?” అని కాజల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. “బహుశా ఆమె పాత్రను సస్పెన్స్ కొనసాగించడానికి పరిచయం చేయలేదా?” అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’ ట్రైలర్‌ను షేర్ చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదల కానుంది. పూజా హెగ్డే రామ్ చరణ్‌తో కలిసి నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ చిరంజీవితో కలిసి నటించింది. అయితే కొరటాల శివ ప్రతి సినిమాలోనే హీరోనే ఎలివేట్ చేస్తాడని, హీరోయిన్ ప్రాధాన్యత గురించి పెద్దగా పట్టించుకోడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.

Exit mobile version