Site icon HashtagU Telugu

Mahesh Babu: డీజే టిల్లుగా మారిన మహేష్ బాబు.. నెట్టింట వీడియో వైరల్?

Mixcollage 07 Mar 2024 11 14 Am 6944

Mixcollage 07 Mar 2024 11 14 Am 6944

టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన హడావుడిలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. అదే ఇటీవల చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. అందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదల అయిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. అయితే ఇందుకోసం మహేష్ బాబును బయట కనిపించకూడదని కండిషన్ పెట్టారట రాజమౌళి. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం మహేష్ బాబు రగడ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది కనిపించబోటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆయనకు సంబందించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మహేష్ బాబును డీజే టిల్లుగా మార్చారు కొందరు అభిమానులు.

 

అలా మహేష్ బాబు డీజే టిల్లుగా మారిపోయారు. కాగా ఇటీవల కాలంలో ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. ఏఐను ఉపయోగించి చాలా మంది సెలబ్రెటీల వాయిస్ టైహో పాటలను క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఫేస్ మార్ఫింగ్ కూడా చేస్తున్నారు. మొన్నా మధ్య డీజే టిల్లు సినిమాలోని అపార్ట్ మెంట్ సీన్ కు మహేష్ బాబు ఫేస్ ను వాయిస్ ను ఉపయోగించి వీడియో చేశారు. ఇప్పుడు అదే సినిమాలో మరోస్ సీన్ ను కెరియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. స్మశానం లో హీరోకు హీరోయిన్ కు మధ్య జరిగే ఫన్నీ కన్వర్జేషన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హీరో సిద్దు జొన్నలగడ్డ పేస్ కి బదులుగా మహేష్ బాబు పేస్ ని సెట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Exit mobile version