Pushpa 2 Pre Release : పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

Pushpa 2 Pre Release : వేడుకలో సినిమాలోని కిస్సిక్ (Kiss Song) పాట ప్లే అవుతుండగా కొందరు అభిమానులు (Fans) ఉత్సాహంగా డాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఒకరిని ఒకరు తోసుకోవడం గొడవకు దారి తీసింది. ఈ ఘర్షణ రెండు వర్గాల అభిమానుల మధ్య తీవ్రంగా మారింది

Published By: HashtagU Telugu Desk
Pushpa 2 Fans Fight

Pushpa 2 Fans Fight

పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Pre Release Event) లో ఫ్యాన్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం అందర్నీ కలవరపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో వైల్డ్ జాతర పేరుతో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాజమౌళి హాజరయ్యారు. అలాగే చిత్రయూనిట్ , పలువురు దర్శక , నిర్మాతలు తదితరులు హాజరై సందడి చేసారు.

కాగా వేడుకలో సినిమాలోని కిస్సిక్ (Kiss Song) పాట ప్లే అవుతుండగా కొందరు అభిమానులు (Fans) ఉత్సాహంగా డాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఒకరిని ఒకరు తోసుకోవడం గొడవకు దారి తీసింది. ఈ ఘర్షణ రెండు వర్గాల అభిమానుల మధ్య తీవ్రంగా మారింది. కొంతమంది తమ కోపాన్ని అదుపు చేసుకోలేక గొడవకు దిగి, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరికొకరు కాలర్స్ పట్టుకొని గొడవకు దిగారు. ఇది క్రమంలో సమీపంలోని మిగతా అభిమానులు వారిని శాంతింపజేయడానికి ట్రై చేసినప్పటికీ వారు ఏమాత్రం శాంతించలేదు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితిని అదుపులోకి వచ్చింది.

ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన వ్యాఖ్యలు చేస్తూ, అభిమానుల ఉత్సాహం అప్పుడప్పుడు అదుపు తప్పడం సహజమని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు మాత్రం ఇటువంటి సంఘటనలు ప్రమోషన్లను చెడగొడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Sanju Samson : భీకర ఫామ్ లో సంజూ.. టైటిల్ పై ఆర్ఆర్ ఆశలు

  Last Updated: 02 Dec 2024, 11:04 PM IST