Site icon HashtagU Telugu

Rashmika: రష్మిక చేసే పనికి షాక్ లో అభిమానులు.. అసలేం జరిగిందంటే!?

Whatsapp Image 2023 03 22 At 19.32.40

Whatsapp Image 2023 03 22 At 19.32.40

Rashmika: ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా పలు భాషల్లో భారీ ప్రాజెక్ట్ లతో క్రేజీ హీరోయిన్ గా ఉంది రశ్మిక. ఈ ఏడాది విజయ్ తో నటించిన వారసుడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది రిలీజైన పది రోజులకే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నుతో ఓటిటి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్ముడు ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ గురించి ఓ విషయం తెలిసింది.

రష్మిక 2016లో కిరాక్ పార్టీతో అరంగేట్రం చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక తాను చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటానని చెప్పంది. పెద్దలంటే తనకి చాలా గౌరవమంది. తల్లిదండ్రులను దైవంతో భావిస్తానంది. వారు లేనిది తాను లేనంది. తనకు పెంపుడు జంతువులతో సమయం గడపటం ఎంతో ఇష్టమన్నారు.

ఇక ఇంటికి వెళ్లినప్పుడల్లా తాను ఇంట్లో ఉన్న తల్లిదండ్రలకు తప్పనిసరిగా వారీ కాళ్లకు దండం పెట్టుకుంటానని చెప్పింది. అంతేకాదు. తన ఇంట్లో పనిచేసే వారి కాళ్లకు సైతం మెుక్కుతానంది. ఇది కేవలం వారికి ఇచ్చే గౌరవమే కాదు.. తనకి అందరూ సమానమనే భావన ఉంటుందన్నారు. అందుకే ఇలా భేదం లేకుండా తనకన్నా పెద్ద వారి కాళ్లకు మెుక్కతానంది.