Pushpa 2 : పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా మీద ఉన్న హైప్ తో టికెట్ రేట్లు భారీగా పెంచారు నిర్మాతలు. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలకు 100 నుంచి 200 వరకు టికెట్ రేట్లు పెంచుతారని తెలిసిందే. కానీ పుష్ప 2 ప్రీమియర్ షోలకి ఏకంగా 800 పెంచారు. దీంతో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోకి టికెట్ ధరలు 1100 నుంచి 1200 వరకు ఉన్నాయి. ఒక్క టికెట్ కే అంత పెట్టాలా అని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.
దీంతో టికెట్స్ విషయంలో పుష్ప 2 పై భారీ వ్యతిరేకత వచ్చింది. ట్విట్టర్ లో బాయ్ కాట్ పుష్ప 2 అని ట్రెండ్ కూడా చేసారు. అయినా నిర్మాతలు తగ్గేదేలే అంటున్నారు. అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తాజాగా నిన్న హైదరాబాద్ లో పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు వచ్చారు.
ఈ ఈవెంట్లో మైత్రి నిర్మాతలు స్టేజిపైకి ఎక్కి మాట్లాడుతుండగా కింద నుంచి ఓ అభిమాని టికెట్ రేటు మరీ 1200 అయితే ఎలా సర్ అని అరిచి ప్రశ్నించాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనికి నిర్మాతలు సమాధానం చెప్పకుండా నవ్వేసి వదిలేసారు. ఇలా అభిమానులే టికెట్ రేట్ల విషయంలో ప్రశ్నిస్తుండటంతో ఇంక మాములు ప్రేక్షకులు ఏం వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కలెక్షన్స్ రికార్డుల కోసం, పెట్టిన డబ్బులు అన్ని లాభాలతో వచ్చేయడానికే పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచినట్లు తెలుస్తుంది.
Aadevado … Sir marii 1200/- ayyite yetta saarr anta 🤣 pic.twitter.com/0BwJ2tRknJ
— WILD SAALE🔥 (@thokkaloteja) December 2, 2024
Also Read : Rajamouli Speech @ Pushpa 2 Pre Release : పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతం – రాజమౌళి