మామూలుగా సినీ తారలు బయట కనిపించడం అన్నది చాలా అరుదు. ఏదైనా ముఖ్యమైన పనులు ఈవెంట్ల సమయంలో తప్పితే పెద్దగా సెలబ్రిటీలు బయట కనిపించరు. ఒకవేళ కనిపిస్తే చాలు అభిమానులు మీడియా వాళ్ళు ఫోటోలు తీయడం కోసం సెల్ఫీల కోసం ఎగబడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలా గతంలో చాలామంది సెలబ్రిటీలకు అభిమానుల నుంచి చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. దాంతో అభిమానుల పట్ల కోపంగా రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా కూడా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక హీరోయిన్ కి చేదు అనుభవం ఎదురయింది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఒక ఫోటో సెషన్ లో భాగంగా విలేకరులతో మాట్లాడుతోంది. ఇంతలోనే వెనుక నుంచి వచ్చిన ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీనే కదా అని ఆమె నవ్వుతూ ఫోటోకి పోజులు ఇవ్వబోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆమె సెల్ఫీ కి నవ్వుతూ ఫోజులు ఇచ్చే సమయంలో సదరు అభిమాని ఆమెకు దగ్గరగా వచ్చి ఫోటో తీసుకుంటూ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో సదరు హీరోయిన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే తేరుకొని సదరు అభిమానిని పక్కకు నెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు హీరోయిన్ పూనమ్. అయితే ఆ వీడియోపై చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఇలాంటివి గతంలో చాలా జరిగాయి ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అటెన్షన్ కోసమే పూనమ్ ఇలా చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియో నిజంగానే రియలా ఆ లేదంటే స్క్రిప్టెడ్ అన్నది తెలియాలి అంటే పూనమ్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.