Site icon HashtagU Telugu

Allu Arjun: అల్లు అర్జున్ ని చూసి బోరున ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్?

Mixcollage 16 Mar 2024 12 22 Pm 6795

Mixcollage 16 Mar 2024 12 22 Pm 6795

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమా లలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల వైజాగ్ కి అల్లు అర్జున్ వెళ్తే అభిమానులు భారీగా వచ్చి బన్నీని ర్యాలీగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఫేవరేట్ హీరోలని కలవాలని, వాళ్ళతో ఫోటోలు దిగాలని, వారితో మాట్లాడాలని అభిమానులు ఎదురు చూస్తుంటారు.

అప్పుడప్పుడు మనకు సినిమా ఈవెంట్స్ లో సడెన్ గా స్టేజి ఎక్కేసి తమ హీరోని కలవాలని కూడా ప్రయత్నిస్తుంటారు అభిమానులు. కొంతమంది తమ హీరోని కలిస్తే ఆనందంతో సంబరపడతారు. తాజాగా ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలిసాడు. దీంతో అల్లు అర్జున్ ని హత్తుకొని ఆనందంతో ఏడ్చాడు. బన్నీ సెక్యూరిటీ అతన్ని పక్కకి పంపించేద్దామని ట్రై చేసినా అల్లు అర్జున్ వారించి అతన్ని ఓదార్చాడు. అల్లు అర్జున్ ఆ అభిమానిని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఓదార్చాడు. దీంతో ఆ అభిమాని చాలా సంతోషంతో పొంగిపోయాడు.

 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కదా మా హీరో అంటూ బన్నీ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఈ సంఘటనతో మరోసారి బన్నీని అంతా అభినందిస్తున్నారు. ఫేవరెట్ హీరోని చూసేసరికి ఆ అభిమాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15 న విడుదల కానుంది. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.