Chiranjeevi : ‘ముఠామేస్త్రి’ సినిమా కోసం.. అప్పట్లో భారీ ధరకి టికెట్ కొన్న అభిమాని.. పేపర్లో వార్త..

ముఠామేస్త్రి చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈక్రమంలోనే టికెట్ సంపాదించడం కోసం ఫ్యాన్స్ వందలు ఖర్చుపెట్టారు. అలా రాజమండ్రిలోని ఓ అభిమాని..

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 07:00 PM IST

ప్రస్తుత రోజుల్లో బడాబడా హీరోల సినిమాల టికెట్స్‌‌ని రేట్లు పెంచి రూ.300, రూ.500 ధరకు అమ్ముతుంటే.. ఆ హీరో అభిమానులు కూడా ఆ సినిమాని చూడాలా లేదా అని ఆలోచిస్తున్నారు. కానీ ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే.. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అప్పు చేసి అయినా సినిమా చూడాలని ప్రయత్నించేవారు. ఈక్రమంలోనే చిరంజీవి(Chiranjeevi )నటించిన ఎన్నో సినిమాలకు.. అప్పటిలోనే వంద, వేల ధరల్లో టికెట్స్ తెగేవి. అలా 1993లో చిరంజీవి నటించిన ముఠామేస్త్రి(Muta Mestri) సినిమా టికెట్‌ని ఓ అభిమాని భారీ ధరకు సొంతం చేసుకున్న వార్త అప్పటి న్యూస్ పేపర్‌లో సంచలనం అయ్యింది.

చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఖైదీ, గూండా, పసివాడి ప్రాణం, రాక్షసుడు, కొండవీటి దొంగ.. ఇలా వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి సినిమా అంటే.. ముఠామేస్త్రి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఠామేస్త్రిగా చిరంజీవి మాస్ ఆడియన్స్ ని రఫ్ఫాడించేశారు. మూవీలోని సాంగ్స్, స్టెప్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ప్రతిదీ ప్రేక్షకుల చేత విజుల్స్ వేయించాయి.

ఇక హిట్టు కాంబినేషన్ కావడం, అది కూడా ‘కొండవీటి దొంగ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత.. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సాంగ్స్ కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి. దీంతో ఈ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈక్రమంలోనే టికెట్ సంపాదించడం కోసం ఫ్యాన్స్ వందలు ఖర్చుపెట్టారు. అలా రాజమండ్రిలోని ఓ అభిమాని.. మొదటిరోజు టికెట్ కోసం ఏకంగా రూ.800 ఖర్చుపెట్టాడట. ఈ విషయం అప్పటి న్యూస్ పేపర్ లో కూడా రావడం విశేషం. అప్పట్లో 800 అంటే చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో ఈ వార్త సంచలనంగా నిలిచి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ మూవీ తరువాత 2002లో వచ్చిన ‘ఇంద్ర’ సినిమాకి అయితే.. ఏకంగా పదివేలు ఖర్చుపెట్టాడంట ఓ అభిమాని. ఆ విషయాన్ని స్వయంగా దర్శకుడు బి గోపాల్ తెలియజేసారు.

Also Read : NTR : ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తే.. ఇలా వంట చేసి భోజనం పెట్టండి..