Shanmukh Jaswanth : షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్ను బాగా పేరు తెచ్చుకున్నాడు. కరోనా సమయంలో యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయ్యాడు. ఏకంగా తెలుగులోనే అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ సెట్ చేసాడు షన్ను. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత ఫేమస్ అయ్యాడు. ఇక దీప్తి సునైనాతో బ్రేకప్, ఓ యాక్సిడెంట్ వివాదం, ఓ అమ్మాయి ఆరోపణలు.. ఇలా వివాదాలతో కూడా వార్తల్లో నిలిచాడు షన్ను.
ఎప్పట్నుంచో షన్ను సినిమాలోకి హీరోగా వస్తాడని అంటున్నారు. అయితే సినిమా ఛాన్సులు రాకపోయినా ఓటీటీల్లో వెబ్ సిరీస్ లతో మెప్పించాడు. ఆహా ఓటీటీలో ఒక సిరీస్ చేయగా త్వరలో ఈటీవి విన్ ఓటీటీలో ఒక సిరీస్ తో రాబోతున్నాడు. ఇన్నాళ్ల తర్వాత షన్ను కల నెరవేరబోతోంది. షణ్ముఖ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
షణ్ముఖ్ జస్వంత్ హీరోగా పరిచయం కాబోతున్నాడు అంటూ నేడు తన మొదటి సినిమా గురించి ప్రకటన చేసారు. నేడు షన్ను పుట్టిన రోజు కావడంతో షన్ను హీరోగా రాబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటించారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో షణ్ముఖ్ జస్వంత్ హీరోగా పరిచయం కాబోతున్నాడు అని ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు. ఇంతకు మించి సినిమా గురించి ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. డైరెక్టర్, హీరోయిన్.. ఏ వివరాలు తెలపలేదు. షన్ను హీరోగా రాబోతున్నందుకు అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్నాళ్లు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మెప్పించిన షన్ను ఇప్పుడు వెండితెరపై హీరోగా ప్రేక్షకులను ఎంతలా మెప్పిస్తాడా చూడాలి.
Also Read : Devara : ‘దేవర’ కొత్త పోస్టర్ రిలీజ్.. బాక్సాఫీస్ ఆయుధ పూజ అంటూ..