BVSN Prasad : జనసేనలోకి సినీ నిర్మాత BVSN ప్రసాద్.. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చేరిక..

జనసేనకు సినీ గ్లామర్ కావాల్సినంత ఉంది. తాజాగా మరింత తోడయింది. నేడు ఉదయం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీలోకి ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చేరారు.

Published By: HashtagU Telugu Desk
Famous Producer BVSN Prasad joined in Janasena party under pawan kalyan at Mangalagiri Office

Famous Producer BVSN Prasad joined in Janasena party under pawan kalyan at Mangalagiri Office

జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వచ్చే సంవత్సరం ఎలక్షన్స్(Elections) పై బాగా ఫోకస్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పవన్ వారాహి యాత్ర(Varahi Yatra) మొదలుపెట్టనున్నారు. తాజాగా నేడు మంగళగిరి(Mangalagiri) పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర ప్రజల మంచి కోసం యాగాన్ని నిర్వహించారు. అలాగే మరో నూతన కార్యాలయం కోసం భూమి పూజ కూడా నిర్వహించారు పవన్.

ఇక ఎలక్షన్స్ టైంలో పార్టీలలో చేరికలు సహజమే. జనసేనలో పై స్థాయిలో ఓ పదిమంది లీడర్లు ఉన్నా అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేరు. అంతా పవన్ పైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జనసేనలోకి వస్తామంటున్న పలువురు ప్రముఖులను పవన్ పార్టీలో చేర్చుకుంటున్నారు.

ఇక జనసేనకు సినీ గ్లామర్ కావాల్సినంత ఉంది. తాజాగా మరింత తోడయింది. నేడు ఉదయం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీలోకి ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చేరారు. నేడు యాగం అయిన తర్వాత పార్టీ కండువా కప్పి పవన్ ఆహ్వానించారు. గతంలో ఈయన పవన్ తో అత్తారింటికి దారేది సినిమా నిర్మించారు. అయితే BVSN ప్రసాద్ MLA టికెట్ ఆశిస్తున్నట్టు, జనసేనకు ఆర్ధికంగా కూడా అండగా ఉండనున్నట్టు సమాచారం.

 

Also Read : Sapthagiri : టీడీపీలోకి నటుడు, కమెడియన్ సప్తగిరి.. అక్కడ్నుంచి పోటీ చేస్తానంటూ..

  Last Updated: 12 Jun 2023, 09:26 PM IST