ప్రఖ్యాత ఫిల్మ్ ఎడిటర్ జిజి కృష్ణారావు (GG Krishnarao) మంగళవారం ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన సుమారు 200 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా దర్శకులు దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, బాపు, జంథ్యాల వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఆయన పని చేశారు. నిర్మాణ సంస్థలు పూర్ణోదయ, విజయమాధవి, తదితర సంస్థలతో కృష్ణారావుకు మంచి అనుబంధం ఉంది.
Also Read: Taj Mahotsav: యూపీలోని ఆగ్రాలో తాజ్ మహోత్సవ్ ప్రారంభం
ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శుభలేక, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, సూత్రధారులు, సీతామహాలక్ష్మి, శృతిలయలు, ముద్దమందారం, నాలుగు స్తంభాలాట, సిరివెన్నెల, శుభసంకల్పం, స్వరాభిషేకం, ఇంకా చాలా క్లాసిక్‌లలో ఆయన భాగమయ్యారు.