Site icon HashtagU Telugu

Venu Swamy : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఫిక్స్..

Famous Astrologer Venu Swamy went into Telugu Bigg Boss Season 8 News goes Viral

Famous Astrologer Venu Swamy went into Telugu Bigg Boss Season 8 News goes Viral

Venu Swamy : ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్(BiggBoss) వచ్చేస్తుంది. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ త్వరలోనే 8వ సీజన్ రాబోతుంది. ఆల్రెడీ బిగ్‌బాస్ వర్క్ మొదలైందని, సెట్ వేస్తున్నారని, ఎవరెవర్ని ఈ సారి హౌస్ లోకి తీసుకురావాలో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ లో పాపులారిటీ తెచ్చుకున్న కొంతమందిని బిగ్‌బాస్ సంప్రదించింది.

ఈ లిస్ట్ లో కుమారి ఆంటీ, రీతూ చౌదరి, హీరో రాజ్ తరుణ్, ఓ జబర్దస్త్ కమెడియన్.. పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా వినిపిస్తుంది. పలువురు సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు వేణుస్వామి. అనేకమంది సినిమా సెలబ్రిటీలు కూడా ఆయన దగ్గరకు వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. పలు వివాదాల్లో కూడా నిలిచారు. ఇటీవల ఆయన జగన్ గెలుస్తాడు అని చెప్తే ఓడిపోవడంతో ఇకపై పబ్లిక్ గా జాతకాలు చెప్పను అని సంచలన ప్రకటన చేసాడు. వీటన్నిటితో వేణుస్వామి తెగ పాపులర్ అయ్యారు.

దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ఈసారి ఆయన పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ బిగ్‌బాస్ నిర్వాహకులు వేణుస్వామిని సంప్రదించి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసారంట. దీంతో వేణుస్వామి ఈసారి బిగ్‌బాస్ లోకి వెళ్లేందుకు ఓకే చెప్పినట్టు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం. ఇన్నాళ్లు బయట జ్యోతిష్యం చెప్పి వివాదాలు, వార్తల్లో నిలిచిన వేణుస్వామి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చి ఎవరి జాతకం చెప్పి మళ్ళీ ఏం సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

 

Also Read : Jagan : జగన్ వ్యాఖ్యలపై నాగబాబు సెటైర్లు