Family Star : అయ్యో ఫ్యామిలీ స్టార్ ఎంత పని జరిగింది..!

Family Star విజయ్ దేవరకొండ, పరశురాం ఈ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా

Published By: HashtagU Telugu Desk
Family Star Result Dil Raju Changed his Decission

Family Star Result Dil Raju Changed his Decission

Family Star విజయ్ దేవరకొండ, పరశురాం ఈ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోగా వీకెండ్ వరకే బాక్సాఫీస్ దగ్గర సినిమా చేతులు ఎత్తేసింది. ఫ్యామిలీ స్టార్ సినిమాను తెలుగుతో పాటుగా హిందీ, మలయాళం, తమిళం లో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు దిల్ రాజు.

ఏప్రిల్ 5న తెలుగు, తమిళ వెర్షన్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మలయాళం, హిందీ వెర్షన్స్ ను రెండు వారాల తర్వాత రిలీజ్ చేస్తామని ప్రమోషన్స్ లో దిల్ రాజు చెప్పారు. తీరా చూస్తే తెలుగులోనే ఫ్యామిలీ స్టార్ డీలా పడిపోయింది. ఇక ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసే సాహసం చేస్తారా అన్న టాక్ నడుస్తుంది. ఫ్యామిలీ స్టార్ విషయంలో దిల్ రాజు కాలిక్యులేషన్స్ తప్పాయి.

తెలుగులో హిట్టైతే హిందీ, మలయాళంలో మంచి బజ్ ఉంటుంది కానీ మన దగ్గరే సినిమాను ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఫ్యామిలీ స్టార్ హిందీ వెర్షన్ రిలీజ్ ఉండకపోవచ్చని టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమేజాన్ ప్రైం సొంతం చేసుకుంది. సో ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

సీతారామ, హాయ్ నాన్న తెలుగులో చేసిన రెండు సినిమాలు హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో ఫస్ట్ ఫ్లాప్ ఫేస్ చేసింది. ఈ సినిమాకు గోపీ సుందరం అందించిన మ్యూజిక్ కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తో తన నెక్స్ట్ సినిమాపై మరింత ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

Also Read : Mrunal Thakur : మృణాల్ మళ్లీ పెంచేసిందా.. అమ్మడు డిమాండ్ కి షాక్ అవుతున్న నిర్మాతలు..!

  Last Updated: 13 Apr 2024, 09:22 AM IST