Dil Raju: కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ : నిర్మాత దిల్ రాజు

Dil Raju: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ పై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ […]

Published By: HashtagU Telugu Desk
Dil Raju Sensational Comments on Shakunthalam

Dil Raju Sensational Comments on Shakunthalam

Dil Raju: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ పై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. అయితే “ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు. దర్శకుడు పరశురామ్ పెట్ల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడారు. “ఫ్యామిలీ స్టార్” సినిమా గురించి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్ లో హాయిగా చూడండి అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ  ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఈ మధ్య చిన్న హింట్ ఇచ్చాను. తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్ అవ్వాలని కోరుకుంటారు. ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి సినిమా రిలీజ్ కు మేము ఇదే శ్రీరాములు థియేటర్ లో మార్నింగ్ షో చూసేందుకు ఏప్రిల్ 5న వస్తాం అని అన్నారు.

  Last Updated: 28 Mar 2024, 11:58 PM IST