DOP KU Mohanan: ఏంటి.. ఫ్యామిలీ స్టార్ మూవీ కెమెరామెన్ ఆ హీరోయిన్ నాన్నేనా!

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 10:30 AM IST

పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా విడుదల తేదికి మరో కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన వ్యక్తి ఒక హీరోయిన్ ఫాదరే నట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.. ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఇండియాలోనే టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన KU మోహనన్ పనిచేసారు. బాలీవుడ్ లో డాన్, తలాష్, లస్ట్ స్టోరీస్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. తెలుగులో గతంలో మహేష్ బాబు మహర్షి సినిమాకు పనిచేసారు. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ స్టార్ సినిమాతో వస్తున్నారు. అయితే KU మోహనన్ కూతురు హీరోయిన్ మాళవిక మోహనన్.

ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తమిళ్, మలయాళం సినిమాల్లో హీరోయిన్ గా తెలుగు వారికి కూడా పరిచయమైన మాళవిక మోహనన్ త్వరలో ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాతో రాబోతుంది. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా KU మోహనన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ సందర్బంగా KU మోహనన్ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కథ. హీరో తన ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనే ఒక మంచి మెసేజ్ తో ఉంటుంది.

ఈ సినిమా కోసం నిజంగా ఒక మిడిల్ క్లాస్ కనపడేలా సెట్స్ వేసాం. సినిమా విజువల్స్ చాలా అందంగా వచ్చాయి. మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి ఈ సినిమా చెప్తుంది. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపోతున్నారు. అందరు కలిసి ఉండట్లేదు. మన ఓల్డ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి ఈ సినిమాలో చూపెట్టబోతున్నారు. ఒక ప్రేమ కథతో పాటు మంచి ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ అవుతుంది ఈ సినిమా అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు, సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.