Site icon HashtagU Telugu

Family Star Censor Talk : ‘ఫ్యామిలీ స్టార్’ కు షాక్ ఇచ్చిన సెన్సార్

Family Star First option that hero Vijay Devarakonda Parasuram Dil Raju

Family Star First option that hero Vijay Devarakonda Parasuram Dil Raju

గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – మృణాల్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 05 న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా గత కొద్దీ రోజులుగా మేకర్స్ ప్రమోషన్ తో సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా మేకర్స్ సెన్సార్ (Censor ) కార్యక్రమాలను పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా కు ‘యు/ఎ’ (Family Star U/A) సర్టిఫికెట్ జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సర్టిఫికెట్ తో పెద్దలతో కలిసి పిల్లలు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అయితే కొన్ని ఫైట్స్ , కొన్ని డైలాగ్స్ కారణంగా యు/ఎ ఇచ్చారని టాక్. అలాగే సినిమాలో కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేసారు. ఆ డైలాగ్స్ ఏంటి అంటే.. ‘లం…. డ’, ‘F…K’, ‘మ…. ద్’, ‘ము….డ’ పదాలు డైలాగుల నుంచి తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించడంతో వాటిని మ్యూట్ చేశారు. అలాగే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు తెలిపింది.

ఇక వీటికి మాత్రమే అభ్యతరం తెలిపిన సెన్సార్ సభ్యులు..సినిమా చాల బాగా వచ్చిందని చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపింది. విజయ్ – మృణాల్ జోడి యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని, సినిమాలో అన్ని సమపాలనలో ఉన్నాయని , యూత్ కు నచ్చే అంశాలు , ఫ్యామిలీ మెచ్చే సీన్లు ఎన్నో ఉన్నాయని తెలిపినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ రావడం తో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు.

Read Also : Chandrababu : నేను శివుడి అవతారం – చంద్రబాబు