Fake Collections : ఫేక్ కలెక్షన్స్.. నిర్మాతలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..!

Fake Collections ఏకంగా మీడియా ముందే అవును మేం ప్రకటించే కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని అంటుంటాడు. అసలు అలా ఫేక్ కలెక్షన్స్ ప్రకటించి సమాజానికి ఏం మెసేజ్

Published By: HashtagU Telugu Desk
Fake Collections What Is The Use For Society

Fake Collections What Is The Use For Society

Fake Collections ఏకంగా మీడియా ముందే అవును మేం ప్రకటించే కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని అంటుంటాడు. అసలు అలా ఫేక్ కలెక్షన్స్ ప్రకటించి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ప్రస్తుతం ఎక్కడ చూసినా గుంటూరు కారం (Guntur Karam) కలెక్షన్స్ గురించి వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. మొదటి షోతో డివైడ్ టాక్ తెచ్చుకున్న మహేష్ గుంటూరు కారం వారం రోజుల్లో ఏకంగా 212 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు ప్రకటించారు. తమ సినిమా ను కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నరని నిర్మాత నాగ వంశీ అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

దీనిపై సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు కలెక్షన్స్ ఎవరి కోసం ప్రకటిస్తున్నారు. సినిమాకు వచ్చే వసూళ్లను ఎలా లెక్క కడతారని చర్చ మొదలైంది. ఒక సినిమా హిట్ ఫ్లాప్ ను నిర్ధేశించేది కలెక్షన్సే. సినిమా సూపర్ హిట్ అయితే వసూళ్లు అదిరిపోతాయి. ఫ్లాప్ అయితే నెక్స్ట్ డే నే థియేటర్ ఖాళీ అవుతుంది. అలా లెక్క కడితే సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి అంటే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.

అయితే నాగ వంశీ ఇదివరకు సినిమా కలెక్షన్స్ ల విషయంలో నిర్మాతలు ఫేక్ రికార్డులు కూడా వేస్తారని అన్నారు. ఆ విషయాన్ని గుంటూరు కారానికి ఆపాదిస్తూ ఈ సినిమా వసూళ్లు కూడా నిజమా లేదా మీరు సృష్టించిన ఫేక్ కలెక్షన్సా అని అంటున్నారు. అయితే నాగ వంశీ మళ్లీ మెలికపెడుతూ అది ప్రూవ్ చేయాల్సింది మీరే అంటున్నాడు.

అంతేకాదు సినిమా ఫలితంపై రివ్యూస్ ఏమాత్రం పనిచేయవని.. సోకాల్డ్ రివ్యూయర్స్ అంతా కూడా గుంటూరు కారం సినిమాకు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారని కానీ ఆడియన్స్ ఆ సినిమాను సూపర్ హిట్ చేశారని.. అది చెప్పేందుకే తాను బయటకు వచ్చానని అంటున్నారు నాగ వంశీ. ఇదంతా ఓకే కానీ గుంటూరు కారం సినిమాకు నిర్మాతలు ప్రకటించిన 212 కోట్ల వసూళ్లు నిజంగా వచ్చినవేనా లేదా ఫేకా అని డౌట్ పడుతున్నారు.

Also Read : Vijay Devarakonda : రౌడీ హీరో కోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..!

ఏది ఏమైనా అది నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు తెలియాల్సిన విషయం తప్ప కామన్ ఆడియన్ కి మీడియాకి ఎప్పటికీ తెలియని ఒక సీక్రెట్ అని చెప్పొచ్చు. సినిమా కలెక్షన్స్ ఇష్టం వచ్చినట్టుగా ప్రకటించడం. దానికి మీడియా ఏదన్నా హైలెట్ చేస్తే దానికి ప్రెస్ మీట్ పెట్టడం కామన్ అయ్యింది. అసలు కలెక్షన్స్ లెక్క ఎలా తేలుస్తారన్నది తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చెప్పొచ్చు.

  Last Updated: 21 Jan 2024, 09:50 AM IST