Pushpa 2 – Fahadh Faasil’s Birthday Treat -‘పుష్ప-2′ నుంచి అదిరిపోయే పోస్టర్..

ఈరోజు (ఆగష్టు 8) ఫహద్ ఫాజిల్ బర్త్ డే కావడంతో ‘పుష్ప 2’ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్

Published By: HashtagU Telugu Desk
Sp Bhanwar Singh Shekhawat

Sp Bhanwar Singh Shekhawat

ఈరోజు ఫహద్ ఫాజిల్ బర్త్ డే (Fahadh Faasil Birthday Treat) సందర్భంగా ‘పుష్ప-2’ (Pushpa 2) నుంచి అదిరిపోయే పోస్టర్ వచ్చింది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. కేవలం అల్లు అర్జున్ కే కాదు ఈ మూవీ లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర లో కాసేపే కనిపించిన ఫహద్ ఫాజిల్..కథను మొత్తం తనవైపు తిప్పుకొని సెకండ్ పార్ట్ ఫై ఆసక్తి కనపరిచాడు.

We’re now on WhatsApp. Click to Join.

పుష్ప-2 లో ఫహద్ ఫాజిల్ పాత్ర మాములుగా ఉండదని చిత్రయూనిట్ చెపుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కనీవినీ యాక్షన్ సీన్లను షూట్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటె ఈరోజు (ఆగష్టు 8) ఫహద్ ఫాజిల్ బర్త్ డే కావడంతో ‘పుష్ప 2’ నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లుంగీ కట్టి ఉరమస్ పోలీస్ లుక్ లో ఫహద్ ఫాజిల్ ఆకట్టుకున్నారు. పైనా పోలీస్ చొక్కా, కింద లుండీ, ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో రివాల్వర్ పట్టుకుని ఏమన్నా ఉన్నడాపో అనుకునేలా ఈ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. వాస్తవానికి ఈ మూవీ ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉన్నా, షూటింగ్ లో జాప్యం కారణంగా డిసెంబర్ 6 కు వాయిదా పడింది.

Read Also : Maruti Alto K10 : మారుతి ఆల్టో కె10 కారులో లోపం.. వాహనాలను రీకాల్ చేసిన కంపెనీ

  Last Updated: 08 Aug 2024, 06:41 PM IST