Never Before : పుష్ప టు కేజీఎఫ్.. టాప్ మోస్ట్ 5 విలన్స్ వీళ్లే!

మీరు బాహుబలి సినిమా చూశారా..? అందులో హీరో ప్రభాస్ క్యారెక్టర్ (బాహుబలి) ఎంత శక్తివంతంగా ఉంటుందో.. అంతకుమించి భళ్లాలదేవ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో విలన్ అడవి దున్నతో ఫైట్ చేసే సీన్ ఇప్పటికీ కళ్లకు కడుతుంది.

  • Written By:
  • Updated On - November 14, 2021 / 12:19 PM IST

మీరు బాహుబలి సినిమా చూశారా..? అందులో హీరో ప్రభాస్ క్యారెక్టర్ (బాహుబలి) ఎంత శక్తివంతంగా ఉంటుందో.. అంతకుమించి భళ్లాలదేవ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో విలన్ అడవి దున్నతో ఫైట్ చేసే సీన్ ఇప్పటికీ కళ్లకు కడుతుంది. ‘‘ఓ మంత్రివర్యా భళ్లాలదేవను దెబ్బకొట్టాలంటే.. ఒకటి కాదు.. పది దున్నలు కావాలి’’ అంటూ నాజర్ చెప్పే డైలాగ్ అసలైన విలనిజం ఎంటో చాటి చెప్తుంది. విలన్ పరక్రామవంతుడైతేనే.. అసలైన హీరోయిజం బయటకువస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ డైరెక్టర్లు ఈ ఈ ఫార్ములాను పాటిస్తున్నారు. హీరోగాకు ధీటుగా విలన్ల కార్యక్టర్లను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా హీరోయిజాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, అలాగే విలనిజాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హీరోయిజం, విలనిజం రెండు సమపాళ్లలో ఉంటేనే సినిమా కిక్ ఇస్తుంది. ప్రస్తుతం ఓ ఐదు ప్రతిష్టాత్మక మూవీలు రాబోతున్నాయి. ఈ టాప్ 5 మోస్ట్ విలన్స్ గురించి తెలుసుకుంటే కచ్చితంగా సినిమా చూస్తారు.

ఫహద్@ఫుష్ప

పుష్ప: ది రైజ్‌లో మలయాళ సూపర్‌స్టార్ ఫహద్ ఫాసిల్ ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అతని దవడ మరియు బట్టతల లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కు మంచి రెస్పాన్ వచ్చింది. గుబురు గడ్డంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఒకేతెరపై అల్లు అర్జున్, ఫహద్ ఢీ అంటూ ఢీ అని కొట్టుకుంటుంటే ఇక అభిమానులకు ఫుల్ మీల్స్ భోజనం లాంటిదేనని చెప్పక తప్పదు. జాతీయ నటుడిగా పేరున్న ఫహద్ మొదటిసారి ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ మూవీ డిసెంబర్ 17, 2021న విడుదల కానుంది.

కేజీఎఫ్@సంజయ్ దత్

కన్నడ హీరో యష్ నటించిన KGF చాప్టర్ 2లో సంజయ్ దత్ పాత్ర పోషించనున్న అధీర ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సీని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో, అంతకుమించి విలన్ (అధీర) పాత్ర కూడా ఉంటుంది. రాకీభాయ్ అధీరను ఎలా ఎదుర్కొంటాడు అనేది వెండితెరపై చూడాల్సిందే మరి.

ఏజెంట్అఖిల్@ మమ్ముటి

ఏజెంట్‌లో అఖిల్ అక్కినేని విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ గూఢచర్యం-థ్రిల్లర్‌లో అఖిల్ స్పై ఏజెంట్‌గా, మమ్ముట్టి ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ ఎక్సైటింగ్ కాంబినేషన్ చూడడానికి తెలుగు ఫ్యాన్ ఆసక్తిగా ఉన్నారు. సినిమాలో ఎక్కువ భాగం విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరించనున్నారు.

హెచ్@కార్తీకేయ

ఆర్‌ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా ఎంత సంపాదించాడో.. విలన్ గానూ మంచి మార్కులు పడ్డాయి. నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలో కార్తీకేయ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. ప్రస్తుతం తలా అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హెచ్ వినోద్ యాక్షన్ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నాడు. భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

సాలార్ @ జగపతిబాబు

ప్రభాస్ నటించిన సాలార్ నుంచి రాజమానార్ గా జగపతి బాబు ఇంటెన్స్ ఫస్ట్ లుక్ ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో విలన్‌గా మునుపెన్నడూ లేని అవతార్‌లో కనిపించనున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ విలన్స్ ఎవరైనా ఉన్నారంటే జగపతిబాబునే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఆయన లెజెండ్స్, అరవింద సమేత లాంటి సినిమాలతో తనలోని విలనిజం బయటకు తీశాడు.