Fahad Fazil Avesham : బాక్సాఫీస్ దగ్గర ఆవేశం.. ఫాఫా సరికొత్త సంచలనం..!

Fahad Fazil Avesham ఈ ఇయర్ మలయాళ పరిశ్రమ నుంచి వస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. ప్రేమలు, మంజుమ్మల్ బోయ్స్, భ్రమయుగం ఇలా వరుస సూపర్ హిట్లు కొడుతున్న

Published By: HashtagU Telugu Desk
Fahad Fazil Avesham 100 Crores Club

Fahad Fazil Avesham 100 Crores Club

Fahad Fazil Avesham ఈ ఇయర్ మలయాళ పరిశ్రమ నుంచి వస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. ప్రేమలు, మంజుమ్మల్ బోయ్స్, భ్రమయుగం ఇలా వరుస సూపర్ హిట్లు కొడుతున్న మలయాళ పరిశ్రమ నుంచి లేటెస్ట్ గా ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం కూడా ఆ హిట్ సినిమాల సరసన చేరింది. జితు మాధవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆవేశం సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతుంది.

ఫాహద్ ఫాజిల్ ని ఎప్పుడు సీరియస్ రోల్ లో చూసిన ఆడియన్స్ ఈ సినిమాలో ఒక కామెడీ గ్యాంగ్ స్టర్ గా చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు. సినిమాలో అతని నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ఆవేశం అంటూ వచ్చి ఫాహద్ ఫాజిల్ అదిరిపోయే హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతుంది.

ఫాహద్ ఫాజిల్ ఆవేశం సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ రీచ్ అయ్యింది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే చాలు అది ఎలాంటి సినిమా అయినా హిట్ చేస్తారని మరోసారి ఆవేశంతో ప్రూవ్ అయ్యింది. ఆవేశం సినిమా చూసిన కొందరు సెలబ్రిటీస్ కూడా సినిమా గురించి ఫాహద్ యాక్టింగ్ గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

రీసెంట్ గా సమంత కూడా ఆవేశం సినిమా చూసి తన కామెంట్ ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. సినిమా చాలా బాగుందని ఫాఫా ఎప్పుడు డిజప్పాయింట్ చేయడని సమంత ఆవేశం గురించి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఫాహద్ ఫాజిల్ ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఫాహద్ ఫాజిల్ పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!

  Last Updated: 24 Apr 2024, 05:03 PM IST