Site icon HashtagU Telugu

Nag and Rajini: క్రేజీ కాంబినేషన్.. రజనీ మూవీలో కింగ్ నాగార్జున

Nag And Rajini

Nag And Rajini

Nag and Rajini: తమిళ స్టార్ ధనుష్ తో ‘కుబేర’ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన నాగార్జున తాజాగా రజనీకాంత్ నటిస్తున్న ‘హుకుం’ చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నాగార్జున సూత్రప్రాయంగా అంగీకరించారని, ఇతర అంశాలపై చర్చిస్తున్నామని చెన్నై వర్గాలు తెలిపాయి. లోకేష్ కనకరాజ్ ఈ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తన యాక్షన్ అడ్వెంచర్ కు ఊతమిచ్చేందుకు వివిధ భాషలకు చెందిన నటులను రంగంలోకి దింపాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్పెషల్ రోల్స్ కోసం డేట్స్ కేటాయిస్తున్న నాగార్జునను తీసుకోవాలని చూస్తున్నాడట. గతంలో హార్ట్ టచింగ్ మూవీ ‘ఊపిరి’లో డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున తమిళ నటుడు కార్తీతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

తన పాపులారిటీ, చరిష్మా దెబ్బతినకుండా మల్టీ హీరో సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. తనకు గౌరవం ఉన్న రజినీకాంత్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే ‘నా సామి రంగా’ సక్సెస్ తో ఊపుమీదున్న నాగార్జున తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం స్క్రిప్టులు వింటున్నాడు.