Site icon HashtagU Telugu

Viral: క్రికెట్ స్టేడియంలో ఈటీవీ ప్రభాకర్ కొడుకు రచ్చ రచ్చ…ట్రోల్స్ ఆగడం లేదుగా..!!

309030336 180147327857106 2719339772096169336 N

309030336 180147327857106 2719339772096169336 N

నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా వస్తూనే రచ్చ రచ్చ చేస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రహాస్ పై ఏ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. చంద్రహాస్ యాటిట్యూడ్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో హంగామా చేశాడు చంద్రహాస్. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో ప్రభాకర్ తన కొడుకుతో కలిసి సందడి చేశారు. జాతీయ పతాకం పట్టుకుని స్టేడియంలో చంద్రహాస్ రచ్చ రచ్చ చేస్తాడు. ఈ సందర్భంగా స్టేడియంలో దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ప్రభాకర్ ఇన్ స్టాలో తన కొడుకుతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అంతేకాదు వాట్ ఏ మ్యాచ్ అంటూ కామెంట్ పెట్టారు. కొంతమంది చంద్రహాస్ ను ఎప్పటిలాగే ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

హీరోగా అస్సలు సెట్ కావు..కెరీర్ పాడు చేసుకోకని…సలహాలిస్తున్నారు. ఇక ఎలాంటి ఖర్చు లేకుండా చంద్రహాస్ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఏ హీరోకి రానంత క్రేజ్ సంపాదించుకున్నాడు.