Site icon HashtagU Telugu

Esha Deol and Bharat Takhtani : విడాకులు తీసుకున్న మరో సినీ జంట..

Esha Deol And Bharat Takhta

Esha Deol And Bharat Takhta

చిత్రసీమ(Film Industry )లో విడాకులు అనేవి కామన్.. షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడడం..కొంత కాలం వరకు సహజీవనం సాగించడం..ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత విడిపోవడం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అన్ని ఇండస్ట్రీ లలో ఎంతోమంది ఇలా విడిపోయిన వారు ఉన్నారు. తాజాగా బాలీవుడ్ చిత్రసీమలో మరో జంట విడిపోయారు.

ప్రముఖ నటి, ఎంపీ హేమమాలిని, ధర్మేంద్ర ముద్దుల కూతురు ఇషా డియోల్ తన భర్త (Esha Deol and Bharat Takhtani) నుంచి విడిపోయారు. ఈ వార్త బాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే వారిద్దరి విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలకు బలం చేకూరేలా ఇషా డియోల్ దంపతులు స్వయంగా తాము విడిపోతున్నట్టు ప్రకటించడంతో రూమర్లకు తెరదింపినట్టు అయింది. 2002లోనే ‘కోయి మేరే దిల్ సే పూచే’ అనే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

2008వరకు దాదాపు ఆరేళ్లలో 30కి సినిమాల్లో నటించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు మూడేళ్లు బ్రేక్ ఇచ్చిన ఈషా డియోల్.. ఇప్పుడు ఓటీటీల్లో నటిస్తోంది. వివాహమైన 12 సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోయింది. గతేడాది జూన్‌లో ఈషా, భరత్ తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే గతేడాది హేమ మాలిని పుట్టినరోజు సందర్భంగా ఈషా డియోల్ తో భరత్ కనిపించకపోవడంతో వారి విడాకుల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.. అంతేకాకుండా ఈషా పుట్టినరోజు వేడుకలకు కూడా భరత్ హాజరు కాలేదు. దీంతో వీరిద్దరూ విడిపోతారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడే దీనిని వారిద్దరూ ఖరారు చేసారు.

Read Also : Big Shock to Sharad Pawar : శరద్‌పవార్ కు ఈసీ భారీ షాక్ ..