Site icon HashtagU Telugu

Mega Family: వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ ఫిక్స్, మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ షురూ!

Varun And Lavanya

Varun And Lavanya

త్వరలో మెగా కుటుంబంలో పెళ్లి సందడి నెలకొనబోతోంది. అందరూ ఊహించినట్టుగా టాలీవుడ్ ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఈ జంట త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించోతోంది. జూన్ 9న ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఈ సంతోషకరమైన సందర్భం మెగా ఫ్యామిలీ లో ఆనందాన్ని నింపింది. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులతో సహా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అల్లు అర్జున్, అతని భార్య స్నేహ మరియు వారి పిల్లలు హాజరు కానున్నారు.

వరుణ్ నిశ్చితార్థాన్ని మెగా కుటుంబం చాలా జాగ్రత్తగా నిర్వహించనుంది. అయితే పెళ్లి వేడుక మాత్రం ఈ ఏడాది చివర్లో జరగనుంది. వరుణ్ మరియు లావణ్యల సంబంధం చాలా కాలంగా గోప్యంగా ఉంచబడింది. కానీ వారి ప్రేమ ఆప్యాయత ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది. “మిస్టర్”, “అంతరిక్షం 9000 KMPH” వంటి సినిమాలతో కలిసి పనిచేసిన జంట కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడింది. ఇన్నాళ్లు ప్రేమలో ఉన్నామనే విషయం చెప్పకుండా దాచిపెట్టారు.

వరుణ్ తేజ్ 2014లో ‘ముకుంద’ సినిమాతో తన నటుడిగా అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత ‘ఫిదా’, ‘ఎఫ్ 2’ ‘తొలి ప్రేమ’ వంటి చిత్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లావణ్య త్రిపాఠి2009లో హిందీ టెలివిజన్ షో ‘ప్యార్ కా బంధన్’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత 2012లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించడంతో ఇదరు మనసులు కలిశాయి. మొదట్లో స్నేహంగా మెలిగిన జంట ఆ తర్వాత ప్రేమలో పడిపోయారు. దీంతో పెళ్లి బంధానికి శ్రీకారం చుట్టబోతున్నారు వీరిద్దరు.

Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేషుడి పనులు షురూ.. ఈ ఏడాది 61 అడుగులతో దర్శనం!