విజయ్ గుండెలపై సేద తీరుతున్న రష్మిక..ఫ్యాన్స్ ఫిదా !!

రియల్ లైఫ్‌లో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు వెండితెరపై తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం తర్వాత, ఈ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి

Published By: HashtagU Telugu Desk
Rashmikavijay

Rashmikavijay

Ranabaali : రియల్ లైఫ్‌లో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు వెండితెరపై తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం తర్వాత, ఈ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజ్‌ను మరింత పెంచుతూ చిత్ర బృందం తాజాగా “ఏందయ్య సామీ” అనే వెడ్డింగ్ సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘నిజ జీవితంలో ఒక్కటయ్యారు.. వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధం’ అంటూ విడుదలైన ఈ వీడియోలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అజయ్-అతుల్ అందించిన మెలోడీ సంగీతం ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఇది 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలం నేపథ్యంలో సాగే ఒక భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా. ‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, విజయ్‌తో చేస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ ‘రణబాలి’ అనే పవర్‌ఫుల్ యోధుడిగా కనిపిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’ అనే సంప్రదాయబద్ధమైన పాత్రలో అలరించనుంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు, సోషల్ మీడియాలో రష్మిక సృష్టిస్తున్న రికార్డులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తన భర్తను పరిచయం చేస్తూ రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పెళ్లి ఫోటో ఏకంగా 23 మిలియన్ల లైక్స్‌ను సొంతం చేసుకుంది. తద్వారా భారత్‌లో అత్యధిక లైక్స్ సాధించిన ఇన్‌స్టా పోస్ట్‌గా చరిత్ర సృష్టించింది. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును ఈ ‘నేషనల్ క్రష్’ అధిగమించడం విశేషం. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో పండించిన మ్యాజిక్, ఇప్పుడు ‘రణబాలి’లో అంతకుమించి ఉండబోతుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో, బాక్సాఫీస్ వద్ద కూడా ఈ జంట కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

  Last Updated: 28 Feb 2026, 01:42 PM IST