Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ పై ఎన్నికల ఎఫెక్ట్, ఆ సినిమాల షూటింగ్స్ రద్దు చేసుకోవాల్సిందేనా!

Pawan

Pawan

ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల సూచనప్రాయంగా చెప్పారు. డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది. ఇది నిజమని తేలితే పవన్ కళ్యాణ్  “OG” “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

సుజీత్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన “ఓజీ” టీజర్‌ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. చివరి దశ చిత్రీకరణ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు, దర్శకుడు హరీష్ శంకర్ సెప్టెంబర్ 5 న “ఉస్తాద్ భగత్ సింగ్” రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాడు. అయితే, నిజంగానే డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగితే, పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్‌లన్నింటినీ రద్దు చేసుకుని రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

తాజాగా బ్రో మూవీ ఓటీటీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా ప్రేక్షకులను విపరీతంగా చూస్తున్నారు. దాంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేషనల్ వైడ్ గా ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో నిలిచినట్టు సమాచారం. ఓటీటీలో బ్రో సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేయడంతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. థియేటర్ లో విడుదలైన బ్రో మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుండటం గమనార్హం.

Also Read: Boys Hostel: బాయ్స్ హాస్టల్ బంపర్ ఆఫర్, బై వన్ గెట్ వన్ టికెట్